Ap politics torism minister chiranjeevi meet with sonia gandhi

chiranjeevi, torism minister chiranjeevi, chiranjeevi meet with sonia gandhi, congress party, ap politics, dl ravindra reddy, minister c ramachandraiah, pcc botsa satyanaranaya, minister jana reddy, cm kiran kumar reddy,

torism minister chiranjeevi meet with sonia gandhi

మంత్రి చిరంజీవి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారా?

Posted: 06/05/2013 06:22 PM IST
Ap politics torism minister chiranjeevi meet with sonia gandhi

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు పై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. రీసెంట్ కిరణ్ కిరణాలకు బలైన వారిలో మంత్రుల్లో ఢీఎల్ రవీంద్ర రెడ్డి ఒకరు. ఢిఎల్ రవీంద్ర రెడ్డి ని మంత్రి పదవి నుండి తొలగించటం పై కొంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై వ్యతిరేక ప్రకటనలు చేసే వారిపై సీఎం కిరణ్ వేటు వేయటంలో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై కొంత మంది మంత్రులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే.

వీరికి సపోర్టుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉండటంతో ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడిక్కినట్లు సమాచారం. ఈరోజు మంత్రి చిరంజీవి , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య ఏకంగా 45 నిమిషాల పాటు చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ భేటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని డిస్మిస్ చేస్తూ కిరణ్ తీసుకున్న నిర్ణయంపై నలువైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ చర్యను పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో పాటు.. మరో మంత్రి జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంలోనే చిరు వర్గానికి చెందిన దేవాదాయ శాఖామంత్రి సి. రామచంద్రయ్యపై కూడా డిస్మిస్ వేటు చేయనున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోనియాతో చిరంజీవి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles