Political kcr vs nagam janardhan

KCR Vs Nagam Janardhan, bjp leader nagam janardhan reddy, trs party chief k chandra sekhara rao, telangana issue, bjp party, congress party,

KCR Vs Nagam Janardhan

కేసిఆర్ నిక్కరపైన నాగం కన్ను? ఏం జరిగిందో నీకు తెలుసా?

Posted: 06/05/2013 01:39 PM IST
Political kcr vs nagam janardhan

మాజీ మంత్రి , ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, జాతీయ పార్టీ అయిన భారతీయ జానత పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నాగం బీజేపిలో చేరి కొన్ని గంటలైన కాకముందే. తన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో కొత్త రహస్యలను బయటపెట్టారు. నాగం టార్గెట్ తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షడు కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలయిందో తెలుసా? అని ప్రశ్నించారు. 1969లో తాను ఉద్యమిస్తున్నప్పుడు కేసీఆర్ నిక్కరన్నా వేసుకున్నావా? అని ఎద్దేవా చేశారు. 1969లో ఏం జరిగిందో నీకు తెల్సా.. అప్పుడు నీవెక్కడున్నావ్.

ఆవేళ ఉద్యమంలో పోలీసు తూటాలకు ఎందరు బలయ్యారో తెలుసా.. నీవు పార్టీ పెట్టిన 2001కి ముందు ఉద్యమమే లేదా? ఇట్లా మాట్లాడడం మిగతా ఉద్యమకారుల్ని అవమానించడమే.. టీఆర్‌ఎస్‌కు పురుడుపోసి, ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం చెందితే నీవు కడచూపుకూ పోలేదు. నీ సంస్కారం అది. నువ్వొక్కడివే తెలంగాణవాదివా? మేమెవ్వరం ఉద్యమం చేయడం లేదా? నీవు పార్టీ పెట్టుకున్నావ్.. తెలంగాణ పేరు పెట్టుకున్నావ్.. అంత మాత్రాన గొప్పోడివా.. 1956 నుంచి తెలంగాణకు ఢోకా ఇస్తున్న కాంగ్రెస్‌తో 2004లో నువ్వసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నావో చెప్పు. కలిసి ఉద్యమం చేయడానికి బదులు ఎన్నికలకు ఏడాది ముందే కాడిపడేసి ఓట్లు, సీట్ల బేరం పెట్టావ్.. చేరికలు, అభినందనల మీటింగులు తప్ప నీవు చేసిందేముంది? ఆ మీటింగ్‌లే ఉద్యమా?’ అని నిప్పులు చెరిగారు. బీజేపీ ఇస్తే వచ్చింది.

ఈ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి జార్ఖండ్ ముక్తిమోర్చాకు పార్లమెంటులో ఒక్కసీటు లేకున్నా వాజపేయి ప్రభుత్వం ఇచ్చిందని’ వివరించారు. అసల నాగం రెచ్చిపోవటానికి కారణం ఇదే ‘తాను పార్టీ పెట్టకపోతే నాగం ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పులు మోసుకుంటూ తిరిగే వాడని, ఉపప్రాంతీయ పార్టీతోనే జార్ఖండ్ వచ్చిందన్న’ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles