Will not leave congress rajaiah

Telangana,Rahul Gandhi,Congress MP Siricilla Rajaiah

Congress MP Siricilla Rajaiah on Friday made it clear that he would not quit the party.

రాజయ్య టీఆర్ఎస్ లో చేరడం లేదు

Posted: 06/01/2013 09:01 AM IST
Will not leave congress rajaiah

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మందా జగన్నాథం, వివేక్ , కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు కూడా తెలంగాణ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ టీంలో ఉన్న మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాత్రం రివర్స్ గేర్ వేశారు. టీఆర్ఎస్ లో చేరబోతున్న వాళ్ళలో ఈయన కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచా రం నిజం కాదు.. కాంగ్రెస్‌లోనే ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఆయన అన్నారు. డెడ్‌లైన్లు అందరూ పెట్టారు... ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నుంచి వివిధ పార్టీలు కూడా డెడ్‌లైన్లు విధించాయి...డెడ్‌లైన్ పెట్టడమనేది రాష్ట్ర ప్రకటింపు కోసం ఒక ఆశాభావం' అని రాజయ్య వివరించారు. అయితే రాజయ్య రివర్స్ గేర్ ఎందుకు వేశాడనే దాని రాజకీయ వర్గాల్లో నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుండి తన ఎంపీ సీటు విషయంలో పూర్తి హామీ రానందువల్లే ఈయన వెనక్కితగ్గినట్లు చెబుతున్నారు. తనకు బీజేపీ నుండి కూడా ఆఫర్ వచ్చిందని, కానీ నేను కాంగ్రెస్ లోనే ఉంటానని, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ పై పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో తెలంగాణ ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాజయ్య తెలిపారు. మొత్తానికి రాజయ్య రివర్స్ గేర్ వేయడం టీఆర్ఎస్ లో చేరే వారికి ఈయన కాస్తంత ఝలక్ ఇచ్చినట్లేని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles