Telangana news kcr fire on chanrababu naidu

kcr fire on chanrababu naidu, trs party, tdp , telangana issue, 2014 election, congress party, trs classes in karimngar , kcr comment on babu, trs leaders, urine, telangana people urine, chandrababu naidu, andhra chief minister, telangana chief minister

kcr fire on chanrababu naidu

ఉచ్చను కూడా వదలసి కేసిఆర్ ?

Posted: 05/25/2013 01:46 PM IST
Telangana news kcr fire on chanrababu naidu

న్నికల సమయం దగ్గరవుతున్న కొద్ది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, తమ మాటల విశ్వరూపం చూపిస్తున్నారు. కొత్త కొత్త తిట్ల కోసం రాజకీయ నాయకులు బుక్క్ లన్నీ తిరగేస్తున్నారు. ప్రత్యర్థులపై ఎలాంటి బూతు పధాలు వాడితే , అవి ప్రజల్లోకి వెళ్ళతాయో అనే వాటిపై కొంత మంది రాజకీయ నాయకులు ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వారిలో.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు లు ముందంజలో ఉన్నారు. ఒకరి మీద ఒకరు బూతు మాటలతో పబ్లిక్ లో తిట్టుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడిపై కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు మోకాళ్లపై నడిచినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఓట్లు అడిగితే ఓట్లు కాదు కదా చంద్రబాబు చేతుల్లో ఉచ్చ కూడా పోయరని ఆయన వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణ ప్రజానీకం సకల జనుల సమ్మె చేసి గుడి, బడి బంద్ పెట్టి ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తే అప్పుడు చంద్రబాబు ఎక్కడ నక్కాడని, ఇప్పుడేమో వస్తున్నా మీ కోసం.. చస్తున్నా మీ కోసం అంటూ వస్తున్నాడని ఆయన అన్నారు. చంద్రబాబుకు తెలంగాణపై స్పష్టత ఉంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. సంక్రాంతి పండగకు గంగిరెద్దుల వాళ్ల మాదిరిగా మళ్లీ మనలను గోల్‌మాల్ చేసేందుకు సీమాంధ్ర పార్టీలు వందల కోట్ల రూపాయలు, లిక్కర్ బాటిళ్లు పట్టుకుని వస్తారని అంటూ అలాంటి వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని, ఒకవేళ వచ్చినా సీఎం తెలంగాణ నాయకుడు కాడని అన్నారు. చంద్రబాబునాయుడో, బాలకృష్ణో, లోకేశో, పీకేశో ఎవడో ఒకడవుతాడని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles