Telugu desam chandrababu naidu stays back in delhi for medical treatment

chandrababu naidu, tdp leader n chandrababu naidu, medical check-up, sprained legs, medical specialists, ntr statue unveiling, balakirshna, tdp,

Chandrababu Naidu Stays Back In Delhi For Medical Treatment

చంద్రబాబు...ఢిల్లీ ఆస్పత్రికి

Posted: 05/08/2013 09:27 AM IST
Telugu desam chandrababu naidu stays back in delhi for medical treatment

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మధ్యాహ్నం స్థానిక లజ్‌పత్ నగర్‌లోని వర్థన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. సుదీర్ఘ పాదయాత్ర వల్ల ఆయనకు కుడికాలు నొప్పి పెడుతోంది. ఎడమకాలి చిటికెనవేలికి కూడా గాయమైంది. నడుము నొప్పి కూడా బాధిస్తోంది. ఈమేరకు ఆయన్ను పరీక్షించిన వైద్యులు కొన్ని చికిత్సలు చేశారు. బుధవారం కూడా ఆస్పత్రికి రావాలని సూచించడంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. సాయంత్రం తాను బస చేసిన తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై చర్చించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles