Political cm kiran kumar reddy assures total removal of belt shops

cm kiran kumar reddy, cm kiran kumar reddy removal belt shops, chief minister n kiran kumar reddy, cm kiran assures to removal of belt shops, rural development minister jairam ramesh

cm kiran kumar reddy assures total removal of belt shops

బెల్టు తీస్తాం ? సీఎం కిరణ్

Posted: 05/06/2013 11:23 AM IST
Political cm kiran kumar reddy assures total removal of belt shops

రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..  బెల్టు తీస్తానని  చెబుతున్నారు.   జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న  మద్యం  విషయంలో  సిఎం దూకుడు పెంచారు.  బెల్టు షాపులను  మహిళలు  తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నారు. బెల్టు షాపులు తీసేయాల్సిందే. వీటిని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయలేదు. వీటికి లైసెన్సు ఏమీ ఇవ్వలేదు. లైసెన్సులు ఇచ్చిన షాపులకు అదనంగా వీటిని పెట్టారు. బెల్టు షాపులను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. అంచెలంచెలుగా వీటిని తొలగించి తీరతాం' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బెల్టు షాపుల ఎత్తివేతపై తొలిసారిగా ఆయన స్పందించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆయన పర్యటించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన పురా పథకం శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో కలిసి పాల్గొన్నారు.  అదే జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని గుడిమెట్లలో ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో తొలుత కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మాట్లాడారు. బెల్టు షాపుల విషయాన్ని ప్రస్తావించారు. వీటిని తక్షణం ఎత్తివేయాలని, దీనికి ఏలూరే వేదిక కావాలని పట్టుబట్టారు. ఇందుకు ఎంపీలు కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రేపో, మాపో కాదు.. ఈరోజు ముఖ్యమంత్రి బెల్టు షాపులపై నిర్ణయం ప్రకటించాల్సిందేనని పంతం పట్టారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి కోరికను తప్పనిసరిగా తీరుస్తామని ప్రకటించారు. దశలవారీగా బెల్టు షాపులను ఎత్తివేస్తామని చెప్పారు. బంగారు తల్లి పథకాన్ని స్వాగతించాలని, దేశంలోనే తొలిసారిగా ఆడపిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకం అమలుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles