Bangarutalli government scheme for girls

bangarutalli govt scheme, bangarutalli for white ration card holders, bangarutalli gets rs 55000 for girls, janani suraksha yojana, sukhibhava, rajiv vidya deevena

bangarutalli government scheme for girls

బంగారుతల్లి వివరాలు

Posted: 05/01/2013 09:47 AM IST
Bangarutalli government scheme for girls

ఆడపిల్ల పుట్టిందంటే భారమని భావించేవారు ఇంకా ఉన్నారు.  ఒక అయ్య చేతిలో పెడితే గాని భారం తగ్గదు అనే మాటలు పూర్వ కాలం నుంచి వింటునే ఉన్నాం.  కాకపోతే మారుతున్న కాలంలో వాడుక భాషలో తేడా వచ్చిందేమో కానీ, ఆడపిల్ల భారమనే భావన మాత్రం పోలేదు.  అందుకే ఆడపిల్లల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది.  ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని తీసుకునిరావటం, రాజకీయాలను కాసేపు పక్కన పెడితే, కుంభకోణాలకున్న అవకాశాలను పట్టించుకోకుండా ఉంటే, నిజంగా చాలా మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకం. 

శిశు సంక్షేమ శాఖా మంత్రి  సునీతా లక్ష్మారెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మే 1 నుంచి ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. 

ఆడపిల్ల పుట్టిన రోజు నుంచి 22 ఏళ్ళ వయసు వచ్చేంతవరకూ అంటే 21 సంవత్సరాలు నిండేంతవరకు ప్రభుత్వం నుంచి మొత్తం 55000 రూపాయలు అందుకోవటానికి ఈ పథకం కింద అర్హత ఉంటుంది.  ఇందుకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు.  జూన్ నెల నుంచి ఈ పథకం కింద చెల్లించవలసిన మొత్తాన్ని నగదు బదిలీ లో ఆన్ లైన్ లో చెల్లిస్తామని మంత్రి తెలియజేసారు. 

అయితే ఇంత వరకు ఉన్న బాలికా సంరక్షణ పథకం ఈ రోజు నుంచి రద్దవుతుంది.  కానీ ఇప్పటి వరకు అందిన దరఖాస్తులకు చెల్లింపులుంటాయని సునీతా తెలియజేసారు. 

ప్రస్తుతం బాలికలకు అమలులో ఉన్న జననీ సురక్షా యోజన, సుఖీభవ, ఉపకార వేతనాలు, రాజీవ్ విద్యా దీవెన, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు యథావిధిగా అమలు జరుగుతాయి.  అవన్నీ కలిపితే ఆడపిల్లలకు మొత్తం 60600 రూపాయలు ముట్టుతాయని మంత్రి వివరించారు.

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని అనేవారు.  కాలక్రమేణా ఖర్చులు పెరుగుతుంటే ఆ మాటలు ఇప్పుడు వినిపించటం లేదు కానీ ఇప్పుడు తెల్లకార్డు ఉన్నవాళ్ళకి మాత్రం బంగారు తల్లి పుట్టింది అనే మాట వినిపించవచ్చు, ఈ పథకం సజావుగా కొనసాగితే.  అయితే, ఈ బంగారు తల్లి కొనసాగేట్టుగా చట్టబద్ధం చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొనసాగేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles