Andhra telugu political news t jac satyagraha deeksha at delhi

t-jac satyagraha deeksha at delhi, telangana jac, tjac chairman m kodandaram, trs party leaders, bjp leaders, cpi party leaders, telangana issue, congress party,

t-jac satyagraha deeksha at delhi

జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష

Posted: 04/29/2013 01:14 PM IST
Andhra telugu political news t jac satyagraha deeksha at delhi

తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలో తెలంగాణ కోసం ఓ వైపు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి, మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమ గళం వినిపిస్తున్నారు. ఐకాస సత్యాగ్ర దీక్షకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ తదితర పార్టీలు మద్దతు పలికాయి. బిజెపి నేతలు ప్రకాష్ జవదేకర్, ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, లెఫ్ట్ నేతలు గుండా మల్లేష్, చాడ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణపై అధికార కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణపై తేల్చాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. పార్లమెంటు గేటు వద్ద ఎంపీలు మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు గేటు 1 వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెసు పార్టీ తెలంగణపై తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటిదాకా తాము తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ ఆందోళనలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. వారికి భాజపా, తెరాస మద్దతు పలికింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles