Pregnant lady kicked on stomack to remove pregnancy

pregnant kicked on stomack, nasik, shyam baba shinde, blind belief, dowry harassment

pregnant lady kicked on stomack to remove pregnancy

కడుపుతో ఉన్న మనిషి కడుపులో తన్నిన రాక్షసత్వం

Posted: 04/17/2013 04:34 PM IST
Pregnant lady kicked on stomack to remove pregnancy

20 సంవత్సరాల గర్భిణీ స్త్రీని ఆమె భర్త తరఫువాళ్ళు అతి దారుణంగా కడుపు మీద కొట్టి కడుపులో బిడ్డను చంపేసారు.  ఈ సంఘటన నాసిక్ లో చోటుచేసుకుంది. 

ఈ నేరానికి, బాధితురాలు సువర్ణ గాయిక్వాడ్ భర్త ఖండేరావ్, మరిది విజయ్, అత్త బీబాబాయ్, మరో కుటుంబసభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

ఇంతకీ ఈ దారుణానికి కారణం ఆమె మీద కోపం కాదు, వాళ్ళకు కలిగిన భయం.  పుట్టిన బిడ్డ వలన అరిష్టం కలుగుతుందని, కుటుంబసభ్యులకు నష్టం వాటిల్లుతుందనే మూఢనమ్మకం.  వాళ్ళల్లో ఆ భయాన్ని కలుగజేసిన వ్యక్తి శ్యామ్ బాబా షిండే.  ఆయనో గురువు.  కడుపులో ఉన్న శిశువుని మూడోకంటితో చూసి, పుట్టబోయేది ఆడపిల్లని, ఆ శిశువు వలన కుటుంబానికి హాని కలుగుతుందని ఎంతో నమ్మకంగా వాళ్ళకి చెప్పాడు.  అంతే, అందరూ కలిసి ఆమెను అబార్షన్ చేయించుకోమని వత్తిడి చేసారు.  అందుకు ఒప్పుకోని ఆమెను అందరూ కలిసి హింసించి గర్భాన్ని పోగొట్టారు.

మరి పోలీసులు ఆ బాబా ను వదిలిపెట్టారా.  నిఫాద్ పట్టణం నుంచి ఆయనగారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.  ఈ సంఘటన ఏప్రిల్ 4 న జరగగా, ఈరోజు కోర్టులో నిందితులందరూ హాజరయ్యారు.  ఎంతోకాలంగా బాధితురాలిని కట్నం కోసం కూడా వేధిస్తున్నట్టుగా కూడా తెలిసింది.  లక్షన్నర రూపాయలు తెమ్మని పోరుతూ వస్తున్న కుటుంబ సభ్యులు గర్భిణీ అని తెలియగానే వాళ్ళ కుటుంబ గురువు షిండే దగ్గరకు తీసుకుని పోగా ఆయన గర్భాన్ని వెంటనే తొలగించకపోతే అందరికీ కీడు సంభవిస్తుందని చెప్పేటప్పటికి ఆ మాట ఆసరాగా, అంతకు ముందునుంచి వున్న కోపం కూడా ఆ విధంగా తీర్చుకున్నారని పోలీసులు తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles