Bhullar must not hang says punjab government to pm

bhullar case, devender pal singh bhullar, h s phoolka, parkash singh badal, punjab, punjab government, sukhbir singh badal, supreme court

bhullar must not hang, says punjab government to pm

భుల్లార్ ను ఉరితీయకండి? సీఎం

Posted: 04/15/2013 03:22 PM IST
Bhullar must not hang says punjab government to pm

దేవిందర్ పాల్  సింగ్ భుల్లార్ ను  ఉరితీయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్  బాదల్ కోరారు.  ప్రధాని  మన్మోహన్ సింగ్ తో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్,  ఉప ముఖ్యమంత్రి  సుఖ్ బీర్ సింగ్ బాదల్  సమావేశమయ్యారు. భుల్లార్ కు ఉరిశిక్ష  అమలు చేస్తే  రాష్ట్రంలో  శాంతిభద్రతల  సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పంజామ్ ముఖ్యమంత్రి  ప్రకాశ్ సింగ్ బాదల్ , ఉప ముఖ్యమంత్రి  ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కు వివరించారు.  1993లో ఢిల్లీలో జరిగిన  కారు బాంబు దాడి కేసులో  ఉరిశిక్షను  ఎదుర్కొంటున్న  భుల్లార్  క్షమాభిక్ష పిటిషన్ ను  సుప్రిం కోర్టు గత వారంలో తిరస్కరించిన  విషయం తెలిసిందే.  1993 సెప్టెంబరులో ఇక్కడ భుల్లార్‌ బాంబు పేల్చి 9 మంది మరణానికి మరో 25 మంది గాయపడడానికి కారకుడయ్యాడని భుల్లార్‌కు మరణ శిక్ష విధించడమైంది. దీనిపై భుల్లార్‌ అపీలు చేసుకోగా 2002 మార్చి 26న సుప్రీం కోర్టు రద్దు చేసింది. తరువాత భుల్లార్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని కూడా 2002 డిసెంబరు 17 న రద్దు చేశారు. దాంతో క్యూరేటివ్‌ పిటిషన్‌ భుల్లార్‌ దాఖలు చేయగా అది కూడా 2003 మార్చి 12న తిరస్కరింపబడింది. కోర్టులు మరణ శిక్షలను విధించినప్పటికీ గత ఎనిమిదేళ్లుగా గత ఏడాది నవంబరు వరకు  అమలు కాక పెండింగ్‌లో ఉంటున్నాయి. 2008 ముంబై దాడుల కేసుకు సంబంధించి మాత్రమే నేరస్తునికి గత ఏడాది నవంబరులో ఉరి శిక్ష అమలు చేశారు. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి సంబంధించి మరో ఉగ్రవాదికి మరణ శిక్ష పడింది. దయాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థించినా ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఫిబ్రవరిలో మరణ శిక్ష అమలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గత ఏడాది జులైలో పదవిని గ్రహించిన తరువాత క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరిస్తూ మరణ శిక్ష అమలుపై కఠినంగా ఉంటున్నారు. దేశంలో 400 మందికి పైగా ఇప్పుడు మరణ శిక్ష వరుసలో ఉన్నారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles