Pilot project in east godavari district with e pos

public distribution system, indian ration shops, ration through epos, aadhar, unique identification number, finger prints

pilot project in east godavari district with e pos

తూగోజి పిడిఎస్ బాలారిష్టలు

Posted: 04/11/2013 12:24 PM IST
Pilot project in east godavari district with e pos

తూర్పుగోదావరి జిల్లాలో పౌరసరఫరా కేంద్రం పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ నూతన విధానం చాలా గొప్పదే కానీ ఏ పనిలోనైనా మొదట్లో కొన్ని అడ్డంకులు తప్పవు కదా.  వాటిని కనిపెట్టి పరిష్కరించుకోవటంలోనే విఙత ఉంది కానీ వాటిని దాచిపెట్టటంలో కాదు కదా. 

ఇందులో ఉపయోగకరమైన విషయాలెన్నో ఉన్నాయి.  అన్నిటికంటే ముఖ్యంగా వినియోగదారుల డేటా అంతా కంప్యూటర్లలో నిక్షిప్తమేవుంటుంది.  దానితో, ఎవరు ఏయే సరుకులు తీసుకున్నారన్న వితరణ విషయాల వెరిఫికేషన్ సులభమౌతుంది.  ఇ పాయింట్ ఆఫ్ సేల్ అనే మిషన్ ని చేతిలో పట్టుకుని ఆపరేట్ చెయ్యవచ్చు.  దానితో కంప్యూటర్ లోని విషయాలను గ్రహించవచ్చు, జరిగిన వితరణను బట్టి దీనిలోంచి కంప్యూటర్ లో డేటా మార్చవచ్చు. 

అన్నిటికన్నా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, కేవలం మిషన్ లో కనిపించటమే కాకుండా దీనిలోంచి శబ్దరూపంలో వివరాలు రావటం.  దీనివలన రేషన్ కార్డ్ లను ఉపయోగించేవారు విద్యావంతులు కాకపోయినా వాళ్ళకి జరుగుతున్నదేమిటో తెలుస్తుంది.  వాళ్ళు ఏమేం తీసుకున్నారు, ఎంతెంత తీసుకున్నారు, ఏ రేటు చొప్పున బిల్లు చేసారు, మొత్తం ఎంతైంది, ఇదంతా పైకి వినిపిస్తుంది.  రేషన్ షాపులో వినియోగదారులను మోసం చెయ్యటాన్ని ఇది అరికడుతుంది.  వినియోగదారుల వివరాలను సరిచూడటానికి ఆధార్ యుఐడ్ నుంచి ఎప్పిటికప్పుడు వివరాలను తీసుకుంటుంది.  ఇది దేశంలోనే మొదటిసారి చేస్తున్న ప్రయోగం.  ఇందులో మొదటిసారిగా లాస్ట్ మైల్ ట్రాకింగ్ విధానాన్ని కూడా పొందుపరచారు.  ఈ విధానం వలన ఆహారధాన్యాలు నిజంగా ఎంతవరకు వినియోగదారులకు చేరాయన్న వివరం లభ్యమౌతుంది.  అంటే ఆహారధాన్యాలు రేషన్ షాపు వరకు వెళ్ళటం వరకే కాకుండా అవి రేషన్ కార్డ్ హోల్డర్ దగ్గరకు చేరిన వివరం కూడా పూర్తిగా ఉంటుంది. 

ఇందులో విధానం ఇలా ఉంది- రేషన్ కార్డ్ తో సరుకుల కోసం వెళ్ళిన వ్యక్తి రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్లను ఇ పోయింట్ సేల్ మెషిన్ లో ఎంటర్ చేస్తారు.  ఆ రెండు పరస్పరం మ్యాచ్ అయినట్లయితే, రెండవ తంతు వేలి ముద్రలను తీసుకోవటం.  ఐదు సార్లు కూడా వేలి ముద్రలు కలవకపోయినట్లయితే వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకుని వాళ్ళకి ఒక్కసారికి ఉపయోగపడే పాస్ వర్డ్ ఆ నంబర్ కి పంపిస్తారు. 

అయితే ఇందులో ఇంతవరకు ఎదురైన సాంకేతిక సమస్యలు రేషన్ కార్ఢ్ హోల్డర్స్ ని సందిగ్ధంలో పడేస్తున్నాయి.  అంతకు ముందు రేషన్ కార్డ్ తీసుకునిపోయి సరుకులు తెచ్చుకునేవారు.  ఇప్పుడు దానితోపాటు వేలి ముద్రలు కూడా ఆన్ లైన్ లో వెరిఫికేషన్ జరుగుతుండటంతో కొన్ని సందర్భాల్లో అవి కలవక నిరాశచెందుతున్నారు.  రేషన్ కార్డ్ మీద ఫోటో ఉన్నా, ఆధార్ మీద ఫొటో ఉన్నా మనిషి ఎదురుగా ఉన్నా మీ వేలిముద్రలు కలవటం లేదంటే ఆ నిర్భాగ్యుడేం చేస్తాడు.  అందుకే ఫోన్ ద్వారా ఒకసారికి పనికి వచ్చే పాస్ వర్డ్ ని జెనరేట్ చేసి ఇస్తున్నారు.  అయినా నిరాశలు, ఆశాభంగాలు, ఆలస్యాలు జరుగుతూనేవున్నాయి.  నూతన విధానం అవటం వలన ఇంకా కొన్ని లొసుగులున్నా, రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు సరుకులు కచ్చితంగా అందించటానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమైతే మంచిదే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles