Pass words are going to be replaced with pass thoughts

pass words, internet, bank accounts, net banking, phone banking, social network, pass thought

pass words are going to be replaced with pass thoughts

పాస్ వర్డ్ బాధలు తప్పుతున్నాయి

Posted: 04/10/2013 05:26 PM IST
Pass words are going to be replaced with pass thoughts

పాస్ వర్డ్ రాసుకుని పెట్టుకుంటే ఎవరికంటైనా పడొచ్చనే భయం, రాసుకోకపోతే మర్చిపోయేన్ని వాడకాలు వచ్చేసాయి.  ఏటిఎమ్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, రైలు బస్సు సినిమా టెకెట్ల ఆన్ లైన్ రిజర్వేషన్స్, ఇంటర్ నెట్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్స్, ఇలా ఎన్నో సందర్భాల్లో పాస్ వర్డ్ ని ఉపయోగించాల్సి వస్తుంది.  అన్నిటికీ ఒకే పాస్ వర్డ్ పెట్టటం మంచిది కాదు, సులభంగా అందరికీ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ లేక ఇయర్ ఆఫ్ బర్త్ ఉండగూడదు,

కొన్ని అప్లికేషన్స్ లో తప్పనిసరిగా వాడవలసిన నంబర్లు, అప్పర్ కేస్, స్పెషల్ కేరక్టర్స్ ఉంటాయి, పైగా పాస్ వర్డ్ ని అప్పుడప్పుడూ మారుస్తూ ఉంటేనే క్షేమకరమని సూచిస్తుంటారు.  అందువలన పాస్ వర్డ్ గుర్తు పెట్టుకోవటం మెదడుకి భారాన్ని కలిగిస్తోంది.  కొన్ని అప్లికేషన్లలో మూడు సార్లు తప్పు పాస్ వర్డ్ కొట్టినట్లయితే ఆరోజుకి లాక్ అయిపోతుంది. ఫోన్ లో ఫోన్ బుక్ పుణ్యమాంటూ ఫోన్ నంబర్లను గుర్తు పెట్టుకునే అవస్తైతే తప్పింది కానీ మిగిలిన వాటిల్లో పాస్ వర్డ్ గుర్తుంచుకోవటం పెద్ద తలనొప్పి కార్యక్రమమైపోయింది. 

ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందుకు మార్గాన్ని కూడా కనిపెట్టారు సాంకేతిక మేధావి వర్గం.  పాస్ వర్డ్ ని మీ మెదడులోంచి వెతికి తీసి కంప్యూటర్ కి అందించే మార్గం.  హెడ్ సెట్ ఒకటి పెట్టుకుంటారు, దానిలోని సెన్సార్ ఫాలభాగాన్ని తాకుతుంటుంది.  ఆ హెడ్ సెట్ బ్లూటూత్ ద్వారా కంప్యూటర్ తో సంపర్కం ఏర్పరచుకుంటుంది.  మెదడులోని ఇఇజి సిగ్నల్స్ ని అందుకుని వాటి ద్వారా పాస్ వర్డ్ ని తీసుకుని యాక్టివేట్ చేస్తుంది. 

ఇది చాలా సురక్షితమంటున్నారు దీన్ని కనిపెట్టిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్ లీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు.  పాస్ వర్డ్ బదులు పాస్ థాట్స్ ఉపయోగపడతాయి.  ఒకవేళ మీ పాస్ థాట్స్ ఎవరికైనా తెలిసినా సరే అది వాళ్ళకి ఉపయోగపడదట.  ఎందుకంటే మెదడు లోని ప్రకంపనాలు ఎవరికి వారికే విడివిడిగా ఉంటాయి.  అందువలన ఆ హెడ్ సెట్ మరొకరు పెట్టుకుంటే వారి మెదడులోంచి వచ్చే ప్రకంపనాలు వేరుగా ఉంటాయి కాబట్టి మీ పాస్ థాట్ వాళ్ళకి పనిచెయ్యదని చెప్తున్నారు. 

ఈ పరికరం మీద ఇప్పటికే విస్తృతంగా పరీక్షలు జరిగాయి.  వేళ్ళ కదలికల ఇమేజింగ్ తో సహా పాస్ థాట్స్ రహస్యాలు మీ మెదడుకి, ఆ పరికరానికి తప్ప మరొకరికి ఉపయోగపడే అవకాశం లేదని హామీ ఇస్తున్నారు.  పది సెకండ్ల కాలం పాటు శ్వాస ను గమనించటమో లేక మరేదైనా ఆలోచన మీద కేంద్రీకరించటమో చేస్తే చాలు మీ పాస్ వర్డ్ తో కంప్యూటర్ పనిచేస్తుంది. 

కంప్యూటర్ వాడకంలో విజయానికి అవసరమైనవి రెండే రెండు లక్షణాలు.  ఒకటి ఫాస్ట్ నెస్- సత్వర ఫలితాలు, రెండు యాక్యురసీ- కచ్చితమైన ఫలితాలు.  ఈ రెండు కూడా ఈ ఇఇజి తో పనిచేసే హెడ్ సెట్ పరికరంలో ఉన్నాయని పరికరాన్ని రూపొందించిన వాళ్ళు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles