High court accepts tenali incident as public interest litigation

high court of ap, tenali incident, public interest litigation, kanta suneela, eve teasing

high court accepts tenali incident as public interest litigation

తెనాలి ఘటన మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం

Posted: 04/10/2013 12:57 PM IST
High court accepts tenali incident as public interest litigation

సరదా సరదాగా మద్యం సేవించి తమాషాగా మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ గడుపుదామనుకున్న తెనాలి యువత మహిళ ప్రాణాలు పోవటానికి కారణమవటమే కాకుండా తమ ప్రాణాలమీదకు కూడా తెచ్చుకున్నారు.  పరిస్థితి అంతవరకు వస్తుందని వాళ్ళు ఊహించివుండరు.  కానీ మద్యం మత్తు మనిషిని అదుపు తప్పేట్టుగా చేస్తుంది.  అయితే మద్యం కొత్త మనిషిని లోపల కూర్చోబెట్టదు.  మనిషి మస్తిష్కంలోని చీకటి పొరల్లో దాగివున్న, సభ్యత పేరుతో అణచివుంచిన కోరికలనే బయట పెడుతుంది. 

మద్యం తాగటం, ఆడపిల్లలను ఈవ్ టీజింగ్ కి గురిచెయ్యటం యువతలో ఉండవలసిన లక్షణాలని పొరబడి, వాటిని మెంటల్ సజెషన్స్ గా తయారు చేసుకుంటున్న యువత దారితప్పితే సమాజానికి ఎంత నష్టం వాటిల్లుతుందన్నది తెనాలి సంఘటన తెలియజేస్తోంది. 

తల్లీ కూతుళ్ళను దుర్భాషలాడుతూ తల్లి కాంతా సునీలను నెట్టివేయగా ఆమె లారీ చక్రాల కింద నలిగిపోయి అసువులుబాసింది.  అందుకు బాధ్యులైన ఏడుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ సమయంలో అక్కడ అందుబాటులో ఉన్న పోలీసులు కానీ స్థానికులు కానీ అంత జరుగుతున్నా తన భార్యా కూతురికి సహాయంగా రాలేదని ఆమె భర్త బాబూరావు ఫిర్యాదు చేసారు.  తాము దళిత వర్గానికి చెందినవాళ్ళవటం వలన పోలీసులు, స్థానికులు వాళ్ళకి కాపాడదామని చూస్తున్నారంటూ బాబూరావ్ ఆరోపించారు. 

ఆ ఘటనకు కారకులైన యువకుల మీద హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించింది.  ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ రమణ పూర్తి నివేదికను ఇవ్వవలసిందిగా పోలీసులను ఆదేశించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles