Opposition parties united for agitation

opposition parties, left parties, tdp, ,trs, yscp, electricity charges hike, govt of ap, state wide bundh

opposition parties united for agitation

ఏకమైన ప్రతిపక్షం

Posted: 04/09/2013 10:36 AM IST
Opposition parties united for agitation

విద్యత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వామపక్షాలు చేసిన బంద్ పిలుపుకి మిగిలిన విపక్షాలు కూడా మద్దతునివ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.  హైద్రాబాద్ ఎల్ బి నగర్ లో వామపక్షాలు, తెదేపా కార్యకర్తలు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి టైర్లలోని గాలి తీసివేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంతవరకూ ఈ ఆందోళన ఆగదని ప్రకటించారు. 

హైద్రాబాద్ లో హయత్ నగర్, ఉప్పల్, ముషీరాబాద్ డిపోల ముందు,  విజయవాడలో నెహ్రూ బస్ స్టేషన్, విద్యాధరపురం, గవర్నర్ పేట, ఆటోనగర్ బస్సు డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు.  ఇంకా కడప, కర్నూలు, నెల్లూరు, కరీం నగర్, గోదావరిఖని, హుజూరాబాద్, సిరిసిల్ల, కోరుట్ల, వరంగల్, జనగాం, మెహబూబాబాద్ బస్సు డిపోలలో కొన్నిటికి తాళాలు కూడా వేసి గేటు ముందు బైఠాయించి ఆందోళనకారులు ఆందోళనలు చేస్తున్నారు.  నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నా ఇంకా దీనితో వేలాది బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. 

ఖమ్మంలో బంద్ ప్రశాంతవాతావరణంలో జరుగుతోంది.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బంద్ కొనసాగుతోంది.  ఈ రెండు జిల్లాలోని 9 డిపోలలో దాదాపు 900 బస్సలు నిలిచిపోయాయి.  విజయనగరం రైల్వే స్టేషన్లో బొకారో ఎక్స్ ప్రెస్ ని నిలిపి వేసి తెదేపా నేతలు ఆందోళన చేసారు.  మెదక్ జిల్లా సంగారెడ్డిలో వామపక్షాలతో పాటు తెరాస, భాజపా, వైకాపా, తెదేపా కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు.  అయితే పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు.  బంద్ దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ముందుగానే బస్సులను డిపోలో నిలిపివేసారు. 

అనంతపురం జిల్లాలో 11 డిపోలలో మొత్తం 1300 బస్సులు నిలిచిపోయాయి.  తెదేపా కార్యకర్తలు బస్సు డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.  కొన్ని జిల్లాలలో విద్యా వ్యాపార సంస్థలను ముందుగానే మూసివేసారు. 

మొత్తానికి విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా చేస్తున్న బంద్ అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో విజయం సాధిస్తోంది.  ఈ రోజు మాత్రమే కాదని, ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే బంద్ ఇంకా కొనసాగుతుందని నేతలు చెప్తున్నారు. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles