Two german mariners arrested on charge of hitting a fishing boadt

two german mariners arrested on charge of hitting a fishing boadt

mariners-arrested.png

Posted: 03/27/2013 09:45 AM IST
Two german mariners arrested on charge of hitting a fishing boadt

german-sailorsఇటాలియన్ నావికాధికారుల కేసు ఇంకా కొలిక్కే రాలేదు, ఇద్దరు జర్మనీ నావికుల అరెస్ట్ జరిగింది.  వీళ్ళద్దరూ మార్చి 16న ఎమ్ వి గ్రీట్జే అనే సరుకుల నావను నడుపుతూ, కాశిమేడు మత్స్యకారుల చేపల పడవను ఢీకొన్నారు.  అందులోంచి ఇద్దరు ఎలాగో తీరానికి చేరుకున్నారు కానీ ఆనందన్ అనే మత్స్యకారుడు సముద్ర జలాల్లో గల్లంతయ్యాడు.  ఇంత వరకూ జాడ తెలియలేదు.  

ఘటనా సమయంలో ఓడ మీద కనిపించిన జెండాని బట్టి అది ఎమ్ విగ్రీట్జే నావ అన్న అనుమానంతో ఆ ఓడ నడుపుతున్న ఉల్ఫ్ గ్యాంగ్ అల్బ్రెక్ట్, స్టెఫెన్ హిన్ ఫోర్త్ లను అరెస్ట్ చేసి మాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి జుడిషియల్ కస్టడీ, ఓడను పరిశీలించటం కోసం దాన్ని అధికారులకు అప్పగించటాన్ని మేజిస్ట్రేట్ ఆదేశించారు.  

వారిని వారి లాయర్ కోరిక మీద షరతులతో కూడిని బెయిల్ మంజూర్ చేసారు.  తాము ఏ తప్పూ చెయ్యలేదని, బెయిల్ ఇచ్చినట్లయితే న్యాయస్తానం కోరినట్టుగా విచారణలో సహకరిస్తామని వారు చేప్పారు.  బెయిల్ మంజూర్ కి ప్రాసిక్యూషన్ అభ్యంతరాలను తెల్పింది.  నిందితులు విదేశీయులు కనుక విచారణకు హాజరు కాలేకపోతారేమోననే అనుమానాన్ని వ్యక్తపరచింది.  కానీ వాళ్ళ మీద మోపిన ఆరోపణ బెయిల్ ఇవ్వదగ్గదే కాబట్టి మేజిస్ట్రేటే వాళ్ళకి బెయిల్ మంజూర్ చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deteriorating fasting kejriwal
All india motor transport corporation strike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles