Dmdmdk members suspension tenure reduced

dmdk party, tamilanadu assembly, radhapuram mla attacked, dmdk mlas suspended, jaya lalita

dmdk members suspension tenure reduced

mlas-suspension-reduced.png

Posted: 03/27/2013 08:25 AM IST
Dmdmdk members suspension tenure reduced

six-mlas

శాసన సభ్యులను సస్పెండ్ చెయ్యటమనే పనికి ఒక రాష్ట్రం లో నాంది పలికితే మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇది పాకిపోతోంది.  ప్రజాప్రతినిధులుగా కొన్ని హక్కులుండే మాట వాస్తవమే కానీ మరీ శాసన సభలో అల్లరి మూకలా ప్రవర్తించటం వలన సభాభంగమవుతుంది, సభా మర్యాదను ఉల్లంఘించటమౌతుంది.  అందువలన అటువంటి వాళ్ళని సభాపతి సస్పెండ్ చెయ్యటమనేది సరైన చర్యే కానీ, ప్రతిపక్షాలను నియంత్రించటానికిదో ఆయుధంగా మారకూడదు.  

తమిళనాడులో సభాపతి పి.ధనపాల్ ఏకంగా ఆరుగురు శాసన సభ్యులను ఒక సంవత్సరకాలం పాటు సస్పెండ్ చెయ్యటం జరిగింది.  దేశీయ ముర్పోక్కు ద్రావిడార్ కళగమ్ పార్టీకి చెందిన ఆ అరుగురు సభ్యులు ఫిబ్రవరి 8 న రాధాపురం శాసనసభ్యుడు ఎస్.రాయప్పన్ మీద దాడి చేసారు.  వారి సస్పెన్షన్ కాలాన్ని తక్కువ చెయ్యాలంటూ ప్రతిపక్షాలన్నీ స్పెషల్ కాల్ అటెన్షన్ మోషన్ ని చేసాయి.  దాని మీద అనవసరమైన చర్చలతో కాలయాపన చెయ్యటం ఎందుకు, శిక్షాకాలాన్ని తగ్గించండంటూ ముఖ్యమంత్రి జయలలిత కూడా సభాపతికి సిఫారసు చెయ్యగా చివరకు 6 నెలలకు తగ్గించటం జరిగింది.

నిండు శాసన సభలో అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన మీద సుమోటో తీసుకున్నా బాగానే ఉండేది కానీ సభాపతి ప్రివిలేజెస్ కమిటీకి పంపించారు.  అంత కాలం సస్పెన్షన్ కి గురవటంలో ఇదే ఇంతవరకు రికార్డ్.  సస్పెన్షన్ కాలంలో శాసనసభ్యులకు జీతం ఉండదు,  ఎమ్ఎల్ఏ హాస్టల్ లో అధికారిక నివాసముండదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All india motor transport corporation strike
Malayalam actress sukumari passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles