Impact of srilankan issue on sports

srilanka tamilians issue, ipl cricket match, chief minister jaya lalita, manmohan singh

impact-of-srilankan-issue-on-sports

srilanka-issue-on-sports.png

Posted: 03/26/2013 04:53 PM IST
Impact of srilankan issue on sports

cricket-stadium

దేశాల మధ్య వివాదాల సెగకు విలవిల్లాడుతున్న క్రీడారంగం

శ్రీలంక భారతదేశాల మధ్య రగులుతున్న సెగల ప్రభావం క్రీడారంగం మీద కూడా బాగా పడుతోంది.  చెన్నై లో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కి శ్రీలంక ఆటగాళ్ళకు ఎటువంటి భద్రతలను కల్పిస్తారంటూ శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ సి) భారత ప్రభుత్వాన్ని అడిగింది.  

శ్రీలంక క్రికెట్ సెక్రటరీ నిషాంత రణతుంగ, ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాకోసం వేచిచూస్తున్నామన్నారు.  బౌద్ధ సన్యాసులతో సహా శ్రీలంకకు చెందిన వారి ఆస్తులమీద పోయిన వారంలో దాడులు జరిగాయి.  ఇంతకు ముందు శ్రీలంక సైనికులకు తమిళనాడులో ఇచ్చే శిక్షణకు అభ్యంతరాలు తెల్పిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా క్రీడారంగంలో కూడా శ్రీలంక జాతీయులను బహిష్కరించటానికే పూనుకున్నారు.

 శ్రీలంక తరఫునుంచి క్రీడాకారులు కానీ, అంపైర్లు కానీ, క్రీడా అధికారులు కానీ, వారికి సాయం చేసే సిబ్బందికానీ లేకుండా ఉంటేనే చెన్నైలో ఏప్రిల్ 3 నుంచి జరుగనున్న ఐపిఎల్ మ్యాచ్ ని అనుమతిస్తామని ముఖ్యమంత్రి జయలలిత తెగేసి చెప్పారు.  ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ కి రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆవిడ స్పష్టం చేసారు.  తమిళనాడులోని ప్రజల హృదయాల్లో శ్రీలంక చేసిన అమానుష కృత్యాలు చెరపలేని లోతైన ముద్రలు వేసాయని, ఈ సందర్భంలో శ్రీలంక క్రీడాకారులను అనుమతించటం వీలుకాదని చెప్తూ, ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకాభిప్రాయంలో ఉన్నాయని కూడా ఆమె అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malayalam actress sukumari passes away
Amitabh magic works in govt programs too  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles