Gang rape in amritsar leaves doublts

gang rape, amritsar gang rape, doubts in gang rape, law protection to women

gang rape in amritsar leaves doublts

gang-rape-in-amritsar.png

Posted: 03/26/2013 03:49 PM IST
Gang rape in amritsar leaves doublts

amritsar-gang-rape

ఎక్కువౌతున్న అత్యాచారాలు, వాటితో పాటే ఎక్కువౌతున్న సందిగ్ధాలు.  

అమృత్ సర్ లో బస్ స్టాండ్ లో ఉన్న 22 సంవత్సరాల అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్ళి నగరంలో 45 నిమిషాలపాటు తిప్పుతూ నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి, చివరకు ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బాధితురాలు సెల్యూలర్ ఫోన్ కంపెనీ ఉద్యోగి.  జరుగుతున్న విషయం బయటకు తెలియకుండా ఉండటం కోసం కారులో స్టీరియోని ఆ సమయంలో బిగ్గరగా పెట్టారట.  

నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలియజేసారు.  ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో ఆమెను చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె శృంగారంలో పాల్గొన్నట్టుగా తేలుతున్నది కానీ ఆమె శరీరం మీద బలవంతంగా దాడి జరిగిన గుర్తులేమీ లేవని తెలిసింది.  

ఈ సంఘటన జరగటానికి ముందు, ఆ తర్వాత కూడా ఆమె సెల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయని, నిందితులు బాధితురాలికి తెలిసినవాళ్ళేనని అనిపిస్తోందని, దర్యప్తు ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలియజేసారు.

బస్సులో విషయం వేరు కానీ నడుస్తున్న కారులో ప్రయాణం చేస్తున్నవారు సీట్లు మారటం అంత తేలిక కాదు.  పైగా స్టీరియో బిగ్గరగా పెట్టటం వలన అది అందరి దృష్టినీ ఇంకా ఆకర్షిస్తుంది.  అంతేకాదు, లోపల శబ్దాలు బిగ్గరగా ఉన్నప్పుడు లోపలి వాళ్ళు ఇంకా బిగ్గరగా మాట్లాడుకోవలసి వస్తుంది.  అప్పుడు అవన్నీ బయటకు వినపడతాయి.  ఆమె నిజంగా కేకలు వేసుంటే ఆ కేకలు లోపలివాళ్ళకి ఆ శబ్దంలో వినపడవు కానీ బయటకు చాలా బాగా వినిపిస్తాయి.  ఇవన్నీ అనుమానాలను రేకెత్తించే విషయాలు.  అయితే ఆడవాళ్ళు ఇటువంటి కేసుల్లో అసలు ఫిర్యాదులు చెయ్యటానికే జంకుతుంటారు కాబట్టి, ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, అత్యాచారం జరిగిందిన ఆరోపించినప్పుడు అది జరిగిందనే విషయాన్ని నిరూపించవలసిన బాధ్యత (ఓనస్) బాధితురాలి మీద కాక ఆరోపణలను ఎదుర్కుంటున్నవారిమీద ఉంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh magic works in govt programs too
Jaya lalita warns upa govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles