No confidence motion notice accepted by ap speaker

ap assembly, no confidence motion, assembly speaker, opposition parties, congress party

no confidence motion notice accepted by ap speaker

no-confidence-motion-now.png

Posted: 03/15/2013 10:41 AM IST
No confidence motion notice accepted by ap speaker

తెలంగాణా రాష్ట్ర సమితి పెట్టి అవిశ్వాస తీర్మానం నోటీసుకి సభాపతి అనుమతి లభించింది.  తెరాస ఇచ్చిన నోటీసుకి స్పందిస్తూ సభాపతి అందుకు మద్దతునిస్తున్న ap-assemblyలెక్కించే కార్యక్రమం మొదలుపెట్టగా అవిశ్వాసానికి మద్దతుదారుల సంఖ్య 45 కి వచ్చింది. కనీసం 30 మంది ఉండాలన్న నియమానికి అనుగుణంగా ఉండటం వలన అవిశ్వాస నోటీసుని ఆమోదించటం జరిగింది.  తెరాస పెట్టదలచుకున్న అవిశ్వాస తీర్మానానికి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, భాజపా, సిపిఐలతోపాటుగా తెలుగు దేశం పార్టీ సభ్యుడు హరీశ్వర రెడ్డి కూడా మద్దతు తెలిపటం విశేషం.

ఇక అవిశ్వాస తీర్మానం మీద తీసుకోవలసిన చర్య గురించి బిఏసి లో చర్చించటానికి వీలుగా సభాపతి సభను అరగంట సేపు వాయిదా వేసారు.  అవిశ్వాసం పై చర్చ ఎప్పుడు ప్రారంభించాలన్న విషయం బిఏసి లో చర్చించిన తర్వాత సభాపతి అన్ని పార్టీల నేతలతో ఈ విషయాన్ని చర్చించి నిర్ణయిస్తారు.

అయితే, తెరాస అవిశ్వాస తీర్మాన నోటీసులో తెలంగాణా ప్రస్తావనే లేదంటూ తెదేపా నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.

అరగంట సేపు చర్చించిన తర్వాత సభాపతి సిఫారస్ మీద బిఏసి అవిశ్వాస తీర్మానం మీద చర్చకు అనుమతించాలని నిర్ణయించింది.  అవిశ్వాస తీర్మానాన్ని పక్కకు పెట్టి బడ్జెట్ ని ప్రవేశపెట్టటం సబబు కాదని సభాపతి అన్నట్టుగా తెలుస్తోంది.  తయారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అమీ తుమీ తేల్చుకుందామని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles