60 fishermen arrested by srilankan navy

srilanka, katchateeu island, fishermen arrested, rameswaram

60 fishermen arrested by srilankan navy

fishermen-katchateevu.png

Posted: 03/14/2013 01:37 PM IST
60 fishermen arrested by srilankan navy

fishermen-katchateevu60 మంది తమిళనాడుకి చెందిన మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్ చేసి వారి 11 బోట్లను స్వాధీనం చేసుకుంది.  ఈ విషయం మత్స్యకారుల సంఘ అధ్యక్షుడు పి.అరుళానందమ్ వెల్లడించారు.  శ్రీలంక కచ్చాతీవు ప్రాంతంలో సముద్రంలో వేటకు పోయిన మత్సకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం,  వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.  

తంగాచిమడమ్ కి చెందిన ఆ మత్స్యకారులు కచ్చాతీవు అనే స్థలంలో చేపలను పట్టటానికి పోయినప్పుడు నావికా దళానికిచెందిన అధికారులు వారిమీద ఇనప కమ్మలతోనూ, తాళ్ళతోనూ విరుచుకుపడ్డారు.  దానితో 20 మంది మత్స్యకారులు గాయపడ్డారు.  వారిని ముందు రామేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స చేసి తర్వాత ఇతర హాస్పిటల్ కి తరలించారు.

నిన్న కూడా తలైమన్నార్ సముద్రజలాలలో వేటకు వచ్చారంటూ 19 మంది మత్స్య కారులను శ్రీలంక అధికారులు అరెస్ట్ చేసారు.  

ఈ రోజు చేపల వేటకు వెళ్ళి అరెస్టైనవారు కచ్చాతీవు 1974లో భారత్ శ్రీలంకకు అప్పగించిన చిన్న దీవి.  ఇక్కడ చేపల వేటకు ఇరు దేశాల వారూ వస్తారు.  దీన్ని తిరిగి భారత్ కి ఇచ్చేయాలంటూ కొందరు రాజకీయనాయకులు ఆందోళన చేసారు.  ఈ దీవిలో మత్స్యాకారులకు కేవలం వలలను ఆరబెట్టుకోవటానికి, అక్కడున్న చర్చిలో ప్రార్ధనలు చెయ్యటానికి మాత్రమే అనుమతి ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambassador of italy restrained by supreme court
External affairs minister meets pm on italian mariners issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles