Hc petition for enquiry on jana reddy assets

minister Jana Reddy, High Court, petition against Jana Reddy, enquiry against Jana assets, CBI investigation, benami companies

The Panchatraj minister K Jana Reddy is in trouble with the petition filed by a lawyer VV Rao in High Court

HC petition for enquiry on Jana Reddy assets.png

Posted: 03/13/2013 08:47 PM IST
Hc petition for enquiry on jana reddy assets

janareddyరాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ నాయకుల పై ఆస్తులకు సంబంధించిన కేసులు హైకోర్టులో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్రమాస్తుల కేసులకు సంబంధించి జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే. ఆయన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ఎర్రచందనం అక్రమ రవాణా కేసు అంటూ ఎమ్మెల్యే శంకర్ రావు కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పంచాయత్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి ఆస్తుల పై వివిరావు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ సొమ్మును జానారెడ్డి వైట్ మనీగా మార్చారని ఆయన ఆరోపిస్తూ పిటీషన్ వేశారు. దీంతో జానా రెడ్డికి చిక్కులు తప్పేటట్లు కనిపిస్తున్నాయి. జానారెడ్డి కి హిమాచల్ ప్రదేశ్ లో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని, జెకెఎఆర్ ఎనర్జీ వెంచర్స్ పేరుతో పది రూపాయల విలువ చేసే షేర్లను 500 రూపాయలకు విక్రయించారని, ఆ రకంగా నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చారని ఆయన జానారెడ్డిపై ఆరోపణలు చేశారు. జానారెడ్డి ఆస్తులపై సిబిఐతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)తో విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు. మరి దీనిపై హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yadagiri guttapng
Jaya prada loses cool threatens to slap reporter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles