New democracy armed forces warn through media

new democracy party, media, govt of andhra pradesh, brother anil

new democracy armed forces warn through media

new-democracy.png

Posted: 03/05/2013 08:59 AM IST
New democracy armed forces warn through media

new-democracy

నిన్న ఇల్లెందు అడవుల్లో మీడియా ప్రతినిధుల ముందు అన్నల బలప్రదర్శన జరిగింది.  వంద మంది సాయుధ దళాలు అడవిలో ఏర్పాటు చేసిన మీడియా సమేవాశంలో హాజరై అందరినీ ఆశ్చర్యచకితులను చేసారు.  ముదురు ఆకుపచ్చ యూనిఫాంలో ముఖాలకు ఆచ్ఛాదనతో న్యూ డెమాక్రసీ కార్యకర్తలు కదం తొక్కుతూ కనిపించారు.  నక్సలైట్లు కూడా ఎప్పుడూ రాని విధంగా సాయుధ బలాలతో వచ్చిన న్యూడెమాక్రసీ దళాలను కదిలిస్తూ వచ్చిన ముఖ్యనేతలు ముఖం మీద చిరునవ్వులతో మీడియాకు స్వాగతం పలికారు. 

ఖమ్మం జిల్లాలోని ఖనిజ సంపదను బ్రదర్ అనిల్ కి దోచిపెట్టటాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు చెప్పారు.  ఇక్కడ సహజ సంపదలను దోచుకునే హక్కు ఎవరికీ లేదని, అక్కడి నైసర్గిక స్వరూపాన్ని, వాతావరణాన్ని, స్థానిక ప్రజల జీవనాన్ని నాశనం చేసేవారిని సహించబోమని వారు తేల్చి చెప్పారు.  ఓపెన్ కాస్టింగ్ కి అసలు అనుమతించబోమని సింగరేణి కాలరీస్ యాజమాన్యన్ని కూడా హెచ్చరించారు.  స్పష్టం చేసారు.  కావలిస్తే భూమి లోపల తవ్వుకోండి కానీ ఓపెన్ కాస్టింగ్ పేరుతో స్థానికుల జీవతాలను అతలాకుతలం చెయ్యటాన్ని సహించమన్నారు.

దళారులు, కాంట్రాక్టర్లు, బీడీ ఫాక్టరీ యజమానులు లాభాలు బాగా గడిస్తున్నారు కానీ, నేలని, అడవిలోని ఆకులను నమ్ముకున్న గిరిజనులకు చాల తక్కువ లభిస్తోంది.  అంతే కాకుండా, అడవిలో ఆకులు ఏరటానికి వెళ్ళి ప్రమాదాల బారిన పడినవారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసారు.  బీడీ ఫాక్టరీల్లో కార్మికులకు అందవలసిన బోనస్ ని వెంటనే విడుదల చెయ్యాలని కోరారు.  సెజ్ లు, ఖనిజ తవ్వకాల పేరుతోనూ, హైవేల అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవటం తగదని, పోలవరం ప్రాజెక్ట్ ని అడ్డుకుంటామని న్యూడెమాక్రసీ ప్రతినిధులు తెలియజేసారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri balakrishna joins chandra babu padayatra
Vayalar ravi hot comments on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles