Botsa satyanarayanapng

Botsa-satyanarayana.png

Posted: 02/25/2013 01:29 PM IST
Botsa satyanarayanapng

ఈ రోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎపిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కి ధన్యవాదాలు తెలియజేసారు.  ఆయన స్వయంగా రాష్ట్రానికి వచ్చి బాధితులను పలకరించటంతో బాంబు పేలుళ్ళ బాధితులకు, రాష్ట్ర ప్రజలలోనూ ధైర్యాన్ని నింపిందని బొత్సా అన్నారు.  పూర్తి బాధ్యతను ప్రభుత్వం వహిస్తుందని, ప్రకటించిన నష్ట పరిహారాలతో పాటుగా అంగవైకల్యం సంభవించిన కేసుల్లో ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. 
ప్రతీదీ రాజకీయం చెయ్యటం ప్రతిపక్షాలకు అలవాటయిపోయిందని, అలా చెయ్యటం తగదని చెప్తూ బొత్సా సత్యనారాయణ, పాదయాత్రలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు.  కాంగ్రెస్ ని హత్య చెయ్యాలని, భూస్థాపితం చెయ్యాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సహనం కోల్పోయి మాట్లాడుతున్న మాటలని అంటూ, రాష్ట్రంలో మూడు నాలుగు స్థానాలకు పరిమితమైన తెలుగు దేశం పార్టీ ఒకటి రెండు స్థానాలకు రావటం కాని పని అని జోస్యం చెప్తూ కాంగ్రెస్ ని మట్టిలో కలుపుతామన్నవారి గతి ఏమయిందో చరిత్ర చూసుకోమని సలహా ఇచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maha kumbhamela holi dips
Supreme court notices on bails in gali janardan reddy case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles