Prime minister to visit hyderabad to talk to bomb victims

prime minister of india, manmohan singh, bomb blast victims

prime minister to visit hyderabad to talk to bomb victims

pm-visits-hyderabad.png

Posted: 02/23/2013 04:58 PM IST
Prime minister to visit hyderabad to talk to bomb victims

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హైద్రాబాద్ రానున్నారు.

ఉన్నట్టుండి హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ రాజకీయ పెద్దలు సందర్శించే స్థలమైపోయింది.  అధికార విపక్ష నేతలు, రాష్ట్ర, కేంద్ర పెద్దలు ఘటనా స్థలిని సందర్శించి, గాయపడినవారిని పరామర్శించారు.  నిఘా వర్గాల హెచ్చరికలను రక్షణ యంత్రాంగం పట్టించుకోలేదంటూ ప్రతిపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తటం కూడా అధికార పార్టీని ఇరుకున పడేస్తోంది.  సాధారణ ఎన్నికలు నెత్తిమీదికి వస్తున్నాయి.  ఇక చిన్న తప్పు కూడా పెద్ద స్థాయిలో దుష్ఫలితాలనివ్వవచ్చు కాబట్టి రాజకీయ పరంగా ఉపేక్షించటానికి వీలులేదు.  అందువలన ఎవరికి వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎదుటివారిని తప్పు పట్టే ప్రయత్నం కానీ తమను తాము సమర్థించుకునే ప్రయత్నం కానీ చేస్తున్నారు. 

దేశ ప్రధాన మంత్రి బాధితులను పరామర్శించటానికి హైద్రాబాద్ రావటమనేది విశేషమే. అయితే అన్నిటినీ రాజకీయ దృష్టి కోణంలో అనుమానంతో చూడగూడదన్నది కూడా సత్యమే.   జరిగిన నష్టాన్ని ఎవరూ పూరించలేరు కానీ, పెద్దల రాక వలన సహాయక చర్యలు సమర్థవంతంగా జరుగుతాయి, బాధితులకు ఊరట కూడా కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maldives ex president nasheed left indian mission
Fire broke in an apartment building in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles