High alert across andhra pradesh after blasts in dilsukhnagar

Hyderabad Dilsukhnagar blast,Andhra Pradesh, blast, cylinder, death, Dilsukhnagar, Hyderabad, terrorism, terrorist

Hyderabad: Police sounded high alert in Hyderabad and other cities in Andhra Pradesh after two blasts killed over 10 people in Hyderabad and injured

High alert across Andhra Pradesh after blasts in Dilsukhnagar.png

Posted: 02/21/2013 08:11 PM IST
High alert across andhra pradesh after blasts in dilsukhnagar

blasts_in_Dilsukhnagar

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. బాంబు పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు హాహాకారాలు చేస్తూ అటు ఇటు పరుగులు తీయడంతో త్రొక్కిసలాట జరిగింది. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై రాష్ట్రమంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. బాంబు పేలుడు గురించి తెలిసిన వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలలో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో వరుస పేలుళ్లు సంభవించడంతో పోలీసులు నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. కోణార్క్ థియోటర్ వద్ద ఒక సైకిల్‌కు టెర్రరిస్టులు బాంబును అమర్చినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఒక హీరో హోండాలో గల మరో బాంబు పేలింది. ఈ సంఘటన పై వివరాలను తెలుసుకునేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి వివరాలు తెలుసుకుంటున్నారు. మరో వైపు ఈ సంఘటన పై ఢిల్లీ నుండి ప్రధాని, సోనిమా, కేంద్రహోంమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ సంఘటన పై వారు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై షిండే ప్రకటన చేశారు. ఈ పేళుళ్లలో 20 చనిపోయారని, యాభై మంది గాయపడ్డారని హోంమంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ ఘటన పై ఆయన ప్రధానికి వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఇంకా మరేమైనా సున్నిత ప్రాంతాలు ఉన్నాయా, మరెక్కడైనా ఇంకా బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందా అని చాలా జాగ్రత్తగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Number of dead in hyderabad blasts reached 16
Pm condemns hyderabad bomb blasts announces compensation for victims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles