Ys viveka threatens to commit suicide

ys vivekananda reddy, ys viveka threatens to commit suicide, y s rajasekhara reddy, ysr congress, dccb chairman election, congress mla, veera shiva reddy, ys viveka, viveka threatens to commit suicide, ys rajasekhar reddy's brother, ys vivekananda reddy, dccb, dccb elections, ysr congress mlas, ysr congress party, ysrcp protest,ysrcp dharna, dccb chairman, cooperative officer, chandrasekhar, ysrcp leaders, vivekananda comments, viveka fires

ys viveka threatens to commit suicide. ysr congress party president y s jaganmohan reddy’s uncle and former minister y s vivekananda reddy created ripples before the kadapa district collectorate on wednesday by threatening to commit suicide if elections to the district cooperative central bank were not held as per the schedule

ys-viveka.gif

Posted: 02/20/2013 08:48 PM IST
Ys viveka threatens to commit suicide

YS Viveka threatens to commit suicide

దివంగత  మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  తమ్ముడు  వైఎస్ వివేకానంద రెడ్డి  ఈ రోజు  కడప జిల్లాలో  రెచ్చిపోయారు.  డీసీసీ ఎన్నికల విషయంలో ఆయన ఆత్మహత్యకైన సిద్దమని హెచ్చరికలు  జారీ చేశారు.  ఎన్నికల అధికారి లేరన్న సాకుతో కడప డీసీసీ ఎన్నికను వాయిదా వేసేందుకు ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోపించారు. నోటిఫికేషన్‌ ప్రకారం ఎన్నిక నిర్వహించాలని, ఎన్నిక నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలనే తమ డిమాండును సర్కారు పట్టించుకోకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణకోసం తాము ఆత్మహత్యకు కూడా సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు కడప డిసిసిబి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.

YS Viveka threatens to commit suicide

డిసిసిబి ఎన్నికల అధికారి అదృశ్యం కావడం, కార్యాలయం వద్దకు భారీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేరుకోవడం, కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి కాన్వాయ్ పైన జగన్ పార్టీ నేతలు చెప్పుల దాడి చేయడం తెలిసిందే. ఆయన దీనిపై వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి అంశంపై వీరాశివారెడ్డి మండిపడ్డారు. డిసిసిబి అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన తన వాహనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చెప్పులు విసిరారని అన్నారు. తమ పార్టీ సభ్యులను తీసుకు వెళ్తున్న సమయంలో జగన్ పార్టీ కార్యకర్తలు దాదాపు 500 మంది వరకు వచ్చి తన వాహనానికి అడ్డుపడి దాడి చేశారన్నారు. చెప్పులు విసిరి బీభత్సం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Husban kills wife in konark express
Ed to take over rs 122 cr worth properties in jagan reddy case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles