Bench and bargif

bench-and-bar.gif

Posted: 02/16/2013 05:22 PM IST
Bench and bargif

    bar-bench-coop

     న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసిమెలిసి పనిచేసి బాధితులకు సత్వర న్యాయం కలుగజేయవలసిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. ఈరోజు కొత్త ఢిల్లీలో దేశస్థాయి బార్ కౌన్సిల్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి, ఈ రోజు దేశవ్యాప్తంగా వాయిదాలలో ఉన్న మూడు కోట్ల కేసుల గురించి మాట్లాడుతూ న్యాయవాదులు (బార్), న్యాయమూర్తులు (బెంచ్) న్యాయానికి కొమ్ముకాయాలని అన్నారు.

     న్యాయం జరగటంలో ఆలస్యమౌతే, అసలు న్యాయం జరగనట్లే అని ఇంగ్లీషులో నానుడి ఉంది. న్యాయవాద వృత్తి చాలా గౌరవప్రదమైనది, బాధ్యతాయుతమైనది. పూర్వకాలంలో న్యాయవాదులను సమాజంలో ఎంతో గౌరవించేవారు. న్యాయం పక్షంలో పనిచేసేవారే న్యాయవాదులు. కానీ కాల క్రమేణా, న్యాయవాద వృత్తిలోని కొన్ని అంశాలు మిగతా బాధ్యతలను పక్కకు నెట్టేసాయి. అవి, ఎటువంటి వారైనా, నిందితునికి తనను తాను చట్టపరంగా రక్షించుకునే (డిఫెండ్ చేసుకునే) హక్కుంది. రెండవది, వృత్తపరంగా ఉన్న నియమానుసారం క్లయింట్ కి సంబంధించిన విషయాలలో గోప్యత పాటించటం. వీటి వలన తన క్లయింట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిసినా వారిని చట్టపరంగా సమర్థించటం అనేది మొదలైంది. దానితో న్యాయవాదం అనే దానికి అర్థం మారిపోయింది.

     ప్రధాన మంత్రి మాట్లాడుతూ, గ్లోబలైజేషన్ పుణ్యమాంటూ కొత్త కొత్త విధానాలలో నేరాలు సంభవిస్తున్నాయి కాబట్టి, న్యాయవాదులు తదనుగుణంగా తమ సాంకేతిక ఙానాన్ని కూడా పెంపొందించుకోవటం అవసరమని అన్నారు.

     చివరగా, ప్రభుత్వం కూడా న్యాయశాఖకి మద్దతుగా నెరవేర్చవలసిన అన్ని బాధ్యతలనూ సక్రమంగా పూర్తిచేసి న్యాయ శాఖను బలోపేతం సమర్థవంతం చేస్తుందని హామీ ఇచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cc cameras in police stations to records police movements
Land grabbing in spiritual garb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles