Rtc telangana mazdoor union

aprtc, telangana, board directors, apsrtc, rtc strike, telangana issu, chief minister n kiran kumar reddy, pcc chief botsa satyanarayana, telangana issue, rtc telangana mazdoor union

rtc telangana mazdoor union

rtc_telangana.gif

Posted: 01/31/2013 07:16 PM IST
Rtc telangana mazdoor union

rtc telangana mazdoor union

తెలంగాణ  నాయకులు  చివరకు  ఆర్టీసీ లో తమ రగడ చూపించారు.  ఆర్టీసీలో  తెలంగాణ వారికి  పదవులు ఇవ్వటంలేదని  మండిపడుతున్నారు.  ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీ యూనియన్‌పై కక్ష్య సాధింపు చర్యలకు సర్కారు తెరలేపింది. ప్రతి సారి గెలిచిన సంఘాల నేతలనే డైరెక్లర్లుగా నియమించడం ఆనవాయితీ. ఈ సారి ఆనవాయితీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మార్చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ సంఘాలు విజయం సాధిస్తే ఓడిపోయిన సంఘాల ప్రతినిధులను బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా సీమాంధ్ర సర్కారు నియమించి ఆర్టీసీలో తెలంగాణ సంఘాలపై కక్ష తీర్చుకుంది. ఆర్టీసీ బోర్డ్‌ఆఫ్ డైరెక్టర్‌లుగా సకల జనుల సమ్మెను విచ్చినం చేయడానికి ప్రయత్నించిన సీమాంధ్రకు చెందిన ఎన్‌ఎంయూ నేతలు మహమూద్, నాగేశ్వర్‌రావు, గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేవలం 360 ఓట్లు వచ్చిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీఐఎన్ టీయూసీ రాధకృష్ణలను నియమించింది. కిరణ్, బొత్స, ఆర్టీసీ యాజమాన్యంపై టీఎంయూ, ఈయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన సంఘాల నేతలను బోర్డ్‌ఆఫ్ డైరెక్టర్‌లు గా నియమించి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీఎంయూ నేతలు అశ్వద్ధామరెడ్డి, థామస్‌రెడ్డిలు ఆరోపించారు. ఆర్టీసీ బోర్డులో తెలంగాణ వాళ్లు ఉంటే సీమాంధ్రకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌లు నడపలేమనే ఈ కుట్రకు తెరలేపారని వారు మండి పడ్డారు. ఆర్టీసీ యాజమాన్యంపై, సర్కారుపై పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal haasan press meet
Sharad pawar bats for telangana raises issue with pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles