Cbi court permits dharmana mopidevi prosecution

Dharmana Prasada Rao, CBI court, Mopidevi Venkata Ramana ,Anti-Corruption Act

A special CBI court on Monday permitted the Central Bureau of Investigation to prosecute Roads and Buildings Minister B Dharmana Prasada Rao and former minister Mopidevi Venkata Ramana under the Anti-Corruption Act.

CBI court permits Dharmana-Mopidevi prosecution.png

Posted: 01/21/2013 06:51 PM IST
Cbi court permits dharmana mopidevi prosecution

harmana_Mopideviవాన్ పిక్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మోపిదేవి వెంకట రమణ, మంత్రి ధర్మాన ప్రసాద రావులకు సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర నష్టం కలిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సి.బి.ఐ. దాఖలు చేసిన కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీని పై తీర్పునిస్తూ... వీరిద్దరి ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ, వాన్‌పిక్ కేసులో ఈ నెల 31 వ తేదీన హాజరు కావాలని సమన్లు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో ఇక ధర్మానా రాజీనామా అనివార్యం అయినట్లే.

మొదట్లో ఆరోపణలు వచ్చిన వెంటనే తన పదవికి రాజీనామా చేసిన ధర్మాన, తరువాత వెనక్కి తగ్గారు. ఇటు ప్రభుత్వం కూడా ధర్మాన ప్రాసిక్యూషన్ కి ప్రభుత్వ అనుమతి కావాలని ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చింది, దీనికి సంబంధించిన ఫైలును గవర్నర్న్ కి పంపితే అతను చూడకుండా ప్రక్కన పడేసి ఇన్ని రోజులు సాగదీశాడు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ధర్మానా రాజీనామా చేసి, కోర్టు ముందు హాజరు కావాల్సిందే. ఈ పరిణామం కిరణ్ సర్కార్ కి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే... పార్టీ అధిష్ఠానం వద్ద కూడా తీవ్ర విమర్శలకు గురి కావచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aadhar cards to be made mandatory for obtaining lpg
Seemandhra leaders in delhi over t issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles