Lagadapati rajagopal ys jagan chandrababu naidu ysr congress

lagadapati rajagopal, ys jagan, chandrababu naidu, ysr congress

lagadapati rajagopal, ys jagan, chandrababu naidu, ysr congress

lagadapati at ysr congress leader residence.png

Posted: 01/21/2013 12:05 PM IST
Lagadapati rajagopal ys jagan chandrababu naidu ysr congress

MP_Lagadapatiవిజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్రిష్ణా జిల్లాలో హల్ చల్ చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా... మీకోసం పాదయాత్ర నేడు క్రిష్ణా జిల్లాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సమైక్య వాదం పై చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలిగిస్తానని చెప్పిన లగడపాటి చంద్రబాబును కలవడానికి నిన్నరాత్రే దొంగలాగ అనుమంచి పల్లెలో  గ్రామంలోకి ప్రవేశించిన ఆయన ఓ ఇంట్లో బస చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లగడపాటిని, ఆయన అనుచరులను అరెస్టు చేయడానికి ఆ ఇంటివద్దకు వెళ్లినప్పుడు ఇంటిలోపల ఉండి తలుపు వేసుకోవడంతో పోలీసులు తలుపులు పగలగొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు.

ఆ ప్రాంతంలో లగడపాటి అనుచరులతో హడావుడి సృష్టించారు. అయితే లగడపాటిని తెలుగు దేశం కార్యకర్తలు అడ్డుకోవనాకి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే లగడపాటి మాత్రం పోలీసులు తాను ఉన్న ప్రైవేటు ఇంటి ఆవరణలోకి ఎలాంటి వారంట్ లేకుండా వచ్చి దౌర్జన్యం చేస్తారని లగడపాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు తమను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అంతా ఖాళీ చేస్తేనే తాను బయటకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను సమైక్యవాదం గురించి చెప్పి, పుష్పం సమర్పించి స్వాగతం చెబుతానని అంటున్నారు. మొత్తానికి లగడపాటి అక్కడ చాలా హంగామా చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sahakara sangala elections stop
Increased railway fares effective from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles