Akbaruddin owaisi judicial custody till jan 22

akbaruddin owaisi, mim, akbaruddin hate speech, adilabad, nirmal

MIM MLA Akbaruddin Owaisi has agreed his mistake regarding Nirmal hate speech.

Akbaruddin Owaisi judicial custody till Jan 22.png

Posted: 01/17/2013 09:46 AM IST
Akbaruddin owaisi judicial custody till jan 22

Akbaruddin_Owaisiఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ సభలో హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన అక్బరుద్దీన్ ఒవైసీని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు విచారించారు. ఈ విచారణలో అక్బరుద్దీన్ కొన్ని నిజాలు చెప్పినట్లు సమాచారం. నిర్మల్ సభలో తనను ఏదో ఆవహించిందని , ఓ పుస్తకం తనను ఆ ప్రసంగం చేయడానికి ప్రేరేపించిందని ఆయన పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇక అంతక ముందు ఆ గొంతు తనది కాదని చెప్పిన అక్బరుద్దీన్ ఆయన ప్రసంగ సీడీలను పరీక్షల నిమిత్తం పోలీసులు పంపించారు. కస్టడీ ముగియడంతో నిర్మల్ కోర్టులో పోలీసులు ఇతనిని ప్రవేశపెట్టారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అక్బరుద్దీన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిర్మల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్బరుద్దీన్‌కు ప్రత్యేక ఆహారం, ప్రత్యేకమైన దుస్తులు ఇవ్వాలని నిర్మల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

ఇక పోతే....అక్బరుద్దీన్ పై మరో కేసు నమోదు అయింది. 2005లో కలెక్టర్‌ను దుర్భాషలాడిన కేసులో ఆయనను మెదక్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న ఈయనను సంగారెడ్డికి తరలించారు. సంగారెడ్డి కోర్డులో ఈయనను హాజరు పరచనున్నారు. అక్బరుద్దీన్‌పై 2005 నుంచి పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంటు అమలుకు అనుమతించాలంటూ పటాన్‌చెరు పోలీసులు సంగారెడ్డిలోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు (ఎక్సైజ్, ప్రొహిబిషన్)లో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అక్బరుద్దీన్ చుట్టూ మరింత గట్టిగా బంధం బిగిసినట్లైయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac mouna deeksha
Tg says high command is favour telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles