Akbaruddin owaisi could be arrested andhra dgp

akbaruddin owaisi, mim, hate speech, akbaruddin owaisi, hyderabad, asauddin owaisi, Andhra DGP, Akbaruddin Owaisi could be arrested: Andhra DGP, Andhra Pradesh Director General of Police Dinesh Reddy,

Akbaruddin Owaisi could be arrested: Andhra DGP

Akbaruddin.gif

Posted: 01/03/2013 06:51 PM IST
Akbaruddin owaisi could be arrested andhra dgp

Akbaruddin Owaisi could be arrested: Andhra DGP

మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటరీ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ చేిసన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడిలా ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త షబ్మమ్ హష్మీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి 153ఎ సెక్షన్ కింద పోలీసులు అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 24వ తేదీన చేసిన హేట్ స్పీచ్‌పై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై తాను వేసిన పిటిషన్ల వంటివి మరిన్ని కోర్టుల్లో దాఖలు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తి ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై రెండు కేసులు నమోదు చేశామని డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతి 121, 153(ఏ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. సమన్లు ఇచ్చేందుకు ఓవైసీ నివాసానికి వెళ్తే ఆయన లండన్‌లో ఉన్నారని తేలిందన్నారు. ఆయన ప్రసంగాన్ని ఉర్దూలోంచి తెలుగులోకి తర్జుమా చేసిన తర్వాత అభియోగాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi hints stalin will be his successor
West bengal chief minister mamata banerjee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles