Huge haul of explosives in hyderabad two held

explosives, hyderabad, gelatin sticks, detonators, banjarahills, new year celebrations, hyderabad police, task force,, transportation and possession of explosives, bombs, Huge haul of explosives in Hyderabad

huge haul of explosives in hyderabad, two held

explosives in hyderabad.gif

Posted: 12/31/2012 11:26 AM IST
Huge haul of explosives in hyderabad two held

huge haul of explosives in hyderabad, two held

జంట నగరాలు కొత్త సంవత్సర వేడుకల కోసం  సిద్దమవుతున్న తరుణంలో కొంత మంది దుండగులు  నూతన సంవత్సర వేడుకల పై కన్ను వేశారు. నగరంలో భారీ విద్వంసం స్రుష్టించాటినికి పెద్ద ఫ్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  31న  రాత్రి పుల్ జోష్ లో  ఉన్న నగరం ప్రజలో పై  ఉగ్రవాదులు దాడికి సిద్దమైట్లు తెలుస్తోంది. నగరంలో భారీ పేలుడు పదార్థాలు, బాంబులను పోలీసులు గుర్తించారు. నగరంలో విఐపీలు ఉండే ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.   బంజారాహిల్స్ పై బాంబుల దాడికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే వాటిని  పోలీసులు గుర్తించటంతో  పెద్ద  ప్రమాదం తప్పింది.  నగరంలో  కొంత మంది అక్రమంగా సంపాదించి పైకి రావాలనే వారు ఇలాంటి పనులకు  పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో పేలుడు పదార్ధాలను విక్రయించేందుకు  ప్రయత్నిస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1300 జిలెటిన్ స్టిక్స్, 2825 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, మారుతి స్విఫ్ట్ కారు, 7 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ మద్ది మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్టోన్ కట్టర్  గండికోట రమేశ్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్  అదనపు డిసిపి రమేశయ్య తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం.1 నాగార్జున సర్కిల్  వద్ద మధుసూదన్‌రెడ్డి తన కారులో ఈ పేలుడు పదార్ధాలను తీసుకుని వచ్చాడు. రమేశ్ మరికొందరికి అందజేసేందుకు ప్రయత్నించగా,  టాస్క్ఫోర్స్‌కు సమాచారం అందడంతో  రెడ్‌హేండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. మధుసూదన్ 2009లో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ నుంచి మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్  పేరుతో పేలుడు పదార్ధాల లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ నిబంధనల ప్రకారం జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్స్ వంటి పేలుడు పదార్ధాలను కొనుగోలు చేయవచ్చు గానీ విక్రయించడానికి అనుమతి లేదు.

huge haul of explosives in hyderabad, two held

అడ్డదారిలో  సంపాదించేందుకు అక్రమంగా వీటిని విక్రయించి కమిషన్ రూపంలో సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలా నిర్లక్ష్యంగా కారులో తీసుకువెళ్లడం వల్ల ఏదైనా వాతావరణ వేడికి గానీ మరే ఇతర కారణాల వల్ల గానీ అవి మండితే భారీ పేలుడు సంభవించేందుకు అవకాశం ఉంటుంది. నడిరోడ్డుపై పేలుడు జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దీనికి తోడు ఇలా అక్రమంగా తరలిస్తున్న పేలుడు సామాగ్రి సంఘ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని పోలీసులు చెబుతున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన మధుసూదన్ లైసెన్సును రద్దు చేయాలని చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్‌కు నగర పోలీసు కమిషనర్ లేఖ రాశారు. పేలుడు పదార్ధాల అక్రమ కొనుగోళ్లు, అమ్మకాలు చేయడం నేరమని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి వెల్లడించారు. ఇందుకు  సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు గురవుతారని అదనపు డిసిపి హెచ్చరించారు. నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kadiyam srihari fire on kcr
New act to ready for rapists should be punished 3o years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles