Purandeswari fire on balakrishna

purandeswari ntr status issued , d purandeswari, purandeswari fire on balakrishna, central minister purandeswari, purandeswari reacts to balakrishnas open letter to her, balakrishna targets purandeswari, chandrababu and purandeswari, ntr statue issue, ntr family,

purandeswari fire on balakrishna

d purandeswari fire.gif

Posted: 12/12/2012 07:45 PM IST
Purandeswari fire on balakrishna

purandeswari fire on balakrishna

ఎన్టీఆర్ విగ్రహం పై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  నిన్న బాలయ్య బహిరంగ లేఖతో  దగ్గుబాటి దంపతులపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దాని కేంద్రమంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ...పార్లమెంట్‌లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో సోదరుడు, టాలీవుడ్ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. బాలయ్య తన ఇంటికి వచ్చారని, అందరం కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిద్దామని అన్నారని, అయితే తన సంతకం కోసం రాలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. అయితే  తన సంతకం లేకుండానే స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించారని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫోన్ చేసి మాట్లాడగా అలా మాట్లాడలేదని బాలయ్య చెప్పినట్లు ఆమె తెలిపారు. సంతకం కోసం ఇంటికి రాలేదని కూడా చెప్పినట్లు పురందేశ్వరి అన్నారు. పార్లమెంటులో ప్రతిష్టాపనకు తాను ఒక్కదాన్నే విగ్రహం ఇవ్వాలని గానీ, ఆ కీర్తిని తాను మాత్రమే కొట్టేయాలని గానీ అనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. బాలయ్య తనకన్నా చిన్నవాడని, తనపై చేసిన వ్యాఖ్యలను బాలయ్య విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. వివాదానికి తాను కారణం కాదని, వివాదం ఎందుకు చోటు చేసుకుందో దాన్ని సృష్టించినవాళ్లనే అడగాలని ఆమె అన్నారు. అసలు వివాదమే లేదని పురందేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి కూడా తాను మూడు సార్లు లేఖను పంపించానని, అది తీసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరనే సమాధానం వచ్చిందని ఆమె అన్నారు. తాను ఒక్కదాన్నే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా అందరూ భాగస్వాములు కావాలి, కలిసి చేద్దామనే మాట మీద తాను నిలబడుతున్నానని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man jumps to death in ghaziabad
Michael palmer resigns reveals involvement in affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles