T congress mps plea to sonia on statehood issue

telangana statehood issue, aicc president sonia gandhi,congress mps, ponnam prabhakar, madhu yaskhi goud, g. vivekananda, manda jagannath, s. rajaiah congress, telangana, telangana rashtra samithi

T-Congress MPs plea to Sonia on statehood issue

T-Congress.gif

Posted: 11/27/2012 11:16 AM IST
T congress mps plea to sonia on statehood issue

T-Congress MPs plea to Sonia on statehood issue

తెలంగాణ అంశం పై మాట్లాడటానికి సమయం ఇవ్వాలంటూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విజ్నప్తి చేశారు.  లోక్ సభ వాయిదాపడిన తర్వాత ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథ్,  రాజయ్య, వివేక్, మధుయాష్కి గౌడ్ లు ఇన్నర్ లాబీలో  సోనియాను  కలిసి  ఒఖ లిఖిత పూర్వక విన్నతిపత్రాన్ని  సమర్పించారు.  సభలోపల ఆందోళన చేసిన కార్యక్రమాలను  అడ్డుకోవద్దంటూ  గతంలో సోనియా చేసిన సూచనను  గౌరవించి నిరసనలను వెలుపలికే పరిమితం చేసిన విషయాన్ని తామె ఆ లేఖలో పేర్కొన్నామన్నారు.  తమతో చర్చలు జరుపుతామని  అప్పట్లో  హామీ  ఇచ్చినా ఇంతవరకూ  ఎవ్వరూ  మాట్లాడలేదని.. ప్రస్తుతం  క్షేత్రస్థాయిలో  పరిస్థితులు తీవ్రంగా  పరిణమించిన నేపథ్యంలో  కాంగ్రెస్  ప్రజాప్రతినిధులంతా  ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతిని తెలిపినట్లు తెలుస్తోంది. అందువల్ల పార్టీ, ప్రత్యేక రాష్ట్ర అంశం పై మాట్లాడటానికి తమకు సమయం ఇవ్వాల్సిందిగా కోరామన్నారు.  అందుకు  ఆమె సానుకూలంగా  స్పందించారనీ , త్వరలో పిలుస్తామని హామీ ఇచ్చారనీ ఎంపీలు తెలిపారు. తాము మాట్లాడిన సమయంలో సోనియా పక్కనే రాహుల్ కూడా ఉన్నట్లు  వారు వెల్లడించారు. 9వ తేదీలోపు తేల్చాలంటూ  తామేమీ డెడెలైన్ పెట్టలేదని  ఒక ఎంపీ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minor girl raped by father brother in kerala
Transplant doctor nobel winner murray dies in boston  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles