Bus stop movie controversy

bus stop movie controversy, bus stop telugu movie, bus top, telugu movie controversy, student unions fires on bus stop movie, bus stop telugu movie controversy, maruthi busstop movie review, busstop moive review,

Bus Stop Movie Controversy

Bus.gif

Posted: 11/12/2012 01:04 PM IST
Bus stop movie controversy

Bus Stop Movie Controversy

దేనికైనారెడీ, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల గొడవ సద్దుమణగకముందే మరో సినిమా వివాదం తెరపైకి వచ్చింది. విడుదలైన ‘బస్టాప్’ సినిమాలో విపరీతమైన ద్వంద్వార్థాలు ఉన్నాయని, ఈ సినిమా విద్యార్థులు, యువతను పక్కదారి పట్టించేలా ఉందంటూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌పై విద్యార్థులు దాడి చేసి పోస్టర్‌లను, ఫ్లెక్సీలను చించివేసి, వాటిని దహనం చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్, చిత్ర యూనిట్ సభ్యులు సినిమా చూస్తుండగానే, వెలుపల ఆందోళన జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి మాట్లాడుతూ.. బస్టాప్ సినిమాలో కళాశాల విద్యార్థులు తమ చదువుల కంటే అమ్మాయిలు, సెక్స్ వంటి అంశాలకే ప్రాధాన్యమిస్తున్నట్లుగా చూపించారని విమర్శించారు. సెన్సార్ బోర్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాప్ సినిమాలోని ద్వంద్వార్థాలను తొలగించకపోతే సోమవారం నుంచి సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sridhar finds fault with censor board over
Fake swami attack by local people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles