Union minister chiranjeevi press meet hyd

union minister chiranjeevi press meet hyd, chiru play key role politics in ap, central minister chiranjeevi, chiru press meet in hyd, minister chiru speech,

union minister chiranjeevi press meet hyd

11.gif

Posted: 11/04/2012 12:37 PM IST
Union minister chiranjeevi press meet hyd

chiru_e

కేంద్రంలో మంత్రి పదవి చేపట్టినా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ తన నాయకత్వంలో పనిచేస్తుందని అనుకోవడం లేదని, అధిష్ఠానం ఏ బాధ్యత మోపినా చిత్తశుద్ధితో పూర్తి చేస్తానని చెప్పారు. అంతేకాని 'కళ్లెం' అందిపుచ్చుకోవాలనే తాపత్రయం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసల వల్ల బేజారెత్తిపోవాల్సిన అవసరంలేదని చెప్పారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్నారు. ప్రజలను చైతన్యపర్చటానికి కాకుండా ఆ వంకతో రాజకీయ లబ్ధి పొందటానికి పాదయాత్రలు చేయటం సరైన విధానం కాదన్నారు. జగన్ అవినీతికి పాల్పడింది సత్యం. అదే విషయం చెబుతున్నా. అంతా అవినీతి తప్పని చెప్పాలి'' అని అన్నారు. వైఎస్ తమ నాయకుడని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టంచేశారు. కాగా, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఇవాళ (ఆదివారం) చిరు లండన్ కు బయలుదేరి వెళ్లారు.
          సినిమాల్లో నటించటానికి టైం ఉంటుందా? అది జరుగుతుందని అనుకోవడం లేదు. ముందు ముందు సౌలభ్యం కలిగితే అభిమానుల కోరిక తీరుతుంది. ఖైదీ సినిమా రీమేక్‌కు ప్రస్తుతం నా కంటే నా కొడుకే (చరణ్) ఎక్కువ సరిపోతాడు'' అని చిరంజీవి అన్నారు. సినిమాల చిత్రీకరణలో ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలా అని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడొద్దని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Floods in andhra pradesh
Ramappa temple in waragangal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles