తెదేపా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతితో తెదేపా పార్టీ శోక సముద్రంలో మునిగిపోయింది. ఈయన మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పార్టీకి, తనకు కుడి భుజం పోయిందట్లు ఉందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబు తన పాదయాత్రను వాయిదా వేసి హుటాహుటిన శ్రీకాకుళం బయల్దేరారు. ఎర్రన్నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. ఈ రోజు తాను చేయాల్సిన పాద యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందిన విషయం తెలుసుకొని తట్టుకోలేక పోయానన్నారు. ఎర్రన్నాయుడు ఎంత ఒదిగినా అణిగిమణిగి ఉండే వ్యక్తి అన్నారు. అతనికి రెండు ప్రమాదాలు జరిగాయని, 2004లో నక్సలైట్ల దాడిలో గాయపడ్డారన్నారు. దీనిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి చాలా నష్టమన్నారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు. ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి అన్నారు.
ఎర్రన్నాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, టిజి వెంకటేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తదితరులు సంతాపం తెలిపారు. ఎర్రన్నాయుడు విషయం తెలుసుకున్న పలువురు జాతీయ నేతలు కూడా ఆయనకు నివాళలు అర్పించాడానికి తరలివస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more