Konda surekha

konda surekha, ysrcp leader konda surekha, ys vijayamma konda surekha,jagan konda surekha, konda murali wife surekha, former parakala mla konda surekha contest in andhra

Is former parakala mla konda surekha contest from andhra region?

32.gif

Posted: 10/26/2012 06:07 PM IST
Konda surekha

surekha

తెలంగాణ వాదం తీవ్రంగా పెల్లుబికిన తరుణంలో సైతం, పార్లమెంట్ లో సమైఖ్యవాదం వినిపించిన జగన్ వెంటే ఉండి, వైఎస్సార్ సీపీ నుంచి పరకాల ఉపఎన్నికల్ల పోటీ చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ. అంతేకాదు ఈ పోటీలో ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారుకూడా. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి ఊతమిస్తూ ఇవాళ బాలినేని వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో పోటీ చేయాలని కొండా సురేఖ భావిస్తే.. తాము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంతేకాదు త్వరలో చంద్రబాబు మైండ్ సెట్ పై క్యాసెట్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమా వాళ్ల డైరెక్షన్ లో చంద్రబాబు యాత్ర చేయడం సిగ్గుచేటని బాలినేని విమర్శించారు.
    ఇదిలా ఉంటే,  వచ్చే ఎన్నికల్లో పరకాలలోనే పోటీచేసి గెలుస్తానని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు దోచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడంలేదని సురేఖ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగజపం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.
     కాగా, అన్న జగన్ తరపున పాదయాత్ర చేస్తోన్న షర్మిలకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఘనస్వాగతం లభించింది. 'మరో ప్రస్థానం' బహిరంగ సభా స్థలం వద్ద జనం భారీ సంఖ్యలో గుమ్మిగూడారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in nacharam tails factory
Special trains south central railway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles