Biodiversity meeting in hyderabad

biodiversity, voluntarily, hyderabad,shilparamam,Meida,

biodiversity meeting in hyderabad

biodiversity.gif

Posted: 10/04/2012 12:13 PM IST
Biodiversity meeting in hyderabad

biodiversity meeting in hyderabad

నగరంలో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలోని ఫుడ్ కోర్టులో ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయి. సదస్సుకు సహకరించడానికి వచ్చిన వాలంటీర్లు కప్పు టీ తాగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నగరం, శివార్లలోని పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.వీరికి పాకెట్ మనీ కింద కొంత మొత్తంలో ఎన్‌జీసీ అందిస్తోంది. అయితే వీరు అందించే డబ్బులకు సదస్సు ప్రాంగణంలో ఉన్న ఫుడ్ కోర్టులో వాటర్ బాటిల్ కూడా రావడం లేదు. ఇక్కడ ఆహార పదార్థాల ధరలను అమాంతం ఫైవ్‌స్టార్ రేట్లకు సమాంతరంగా పెంచేశారు. కప్పు టీ ధర రూ. 60 , సమోసా ధర రూ. 50 , భోజనం తినాలంటే ఏకంగా రూ. 360 చెల్లించాల్సిందే. ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేక వాలంటీర్లు అల్లాడుతున్నారు. పోనీ ఇంటి నుంచో లేక బయట బహిరంగ మార్కెట్ నుంచో ఆహారాన్ని తీసుకుని వద్దామంటే దాన్ని సెక్యూరిటీ అడ్డుకుంటోంది.

బిస్కెట్ ప్యాకెట్‌ను సైతం అనుమతించడం లేదని ఓ వాలంటీర్ వాపోయాడు. ఫుడ్ కోర్టు ధరలను భరించలేక సగానికి పైగా వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను వాలంటీర్ల ప్రతినిధులు జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య దృష్టికి తీసుకుని వెళ్లారు. పరిస్థితిలో మార్పు రాకపోతే వాలంటీర్లు సదస్సుకు రావడం మానేస్తామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి సదస్సును కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ఉంది. రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు బోజనం ఏర్పాటు చేశారు. అయితే ఆ బోజనాన్ని సైతం సదస్సులోకి అనుమతించలేదు. దీంతో శిల్పారామంలో సమాచార శాఖాధికారులు మీడియా ప్రతినిధులకు బోజనం ఏర్పాటు చేశారు. అదే సమయంలో సదస్సులో కీలకమైన సమాంతర సమావేశాలు ప్రారంభం కావడంతో చాలా మంది మీడియా ప్రతినిధులు శిల్పారామానికి వెళ్లలేకపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bacteria turn toxins into gold
Mother sells baby boy to buy mobile phone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles