Now a bhagat singh chowk in pakistan

roundabout,Bhagat singh,CDGL,people.lahore Jail,March 1931,british rule,revolutionary, Bhagat Singh Chowk, Pakistan,Bhagat singh chowk in Lahore, Bhagat Singh chowk in Pakistan, Bhagat Singh

Pakistan names Chowk after Bhagat Singh in Lahore

Bhagat.gif

Posted: 10/03/2012 12:28 PM IST
Now a bhagat singh chowk in pakistan

Pakistan names Chowk after Bhagat Singh in Lahore

పాకిస్థాన్ లాహోర్ లోని షెడ్ మన్ చౌక్ పేరును భగత్ సింగ్ చౌక్ గా మార్చాలని పాకిస్థాన్ లో ఫౌర సమాజం డిమాండ్ చేసింది. భగత్ సింగ్ తో పాటుగా సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీసిన ప్రదేశానికి భగత్ సింగ్ పేరును పెట్టాలని వారు డిమాండ్ చేశారు. భగత్ తో పాటుగా మరో ముగ్గురు ప్రణార్పం చేసిన మార్చి 23న పౌరసమాజం సభ్యలు వీరికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఈ ప్రాంతంకోసం ప్రణత్యాగం చేసిన ముగ్గురు మహనీయుల త్యాగాన్ని కొనియాడారు. వెంటనే ఈ ప్రాంతానికి భగత్ సింగ్ పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. బ్రిటీష్ పాలకుల నుండి స్వాతంత్ర్యాన్ని పొందడం కోసం ప్రాణత్యాగం చేసివారి పేరు పెట్టడం సముచితమని వారు అభిప్రాయ పడ్డారు. మరో వైపు పాకిస్థాన్ లో అక్కడి పౌర సమాజం భగత్ పేరును ఒక ప్రాంతానికి పెట్టాలని ప్రతిపాదన చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామమని వారు అభిప్రాయపడ్డారు.

Pakistan names Chowk after Bhagat Singh in Lahore

భారత్‌తో సాన్నిహిత్యం కోసం తపిస్తున్న పాక్ అధికారులు లాహోర్‌లోని షాద్‌మాన్ చౌరస్తాకు భగత్ సింగ్ చౌరస్తా అని నామకరణం చేశారు. తాజాగా అక్కడ ఆయన విగ్రహాన్ని నెలకోల్పాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చౌరస్తాకు భగత్ పేరు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్ని మతాలకు, అందరు ఉద్యమకారులకు చెందిన విజయంగా ఏళ్లుగా దీని కోసం ఉద్యమిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ సెక్యులర్ స్టడీస్ చెప్పిందని డెయిలీ టైమ్స్ అనే పత్రిక తెలిపింది. స్వాతంత్ర్య సాధన కోసం భగత్ సింగ్ చేసిన కృషిని పాక్ గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. లాహోర్‌లోని జైలులోనే భగత్ సింగ్ ఉరితీయబడ్డారు.స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భగత్‌సింగ్‌ను 1931 మార్చిలో లాహోర్ జైలులో ఉరితీశారు. అప్పట్లో ఆ జైలు ఉన్న స్థానంలోనే ఇప్పుడు షాద్‌మాన్ చౌరస్తా ఉంది. అందుకే ఆ యోధుని సాహసాలకు గుర్తుగా భగత్‌సింగ్ చౌరస్తాగా దానికి నామకరణం చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా లాహోర్‌లోని కొన్ని ప్రాంతాలకు, పాత క్వార్టర్స్‌కు ఉన్న హిందూ పేర్లను మార్చిన పాక్ అధికారులు దీనికి భగత్‌సింగ్ చౌరస్తా అని పేరుమార్చడం సాహసవంతమైన నిర్ణయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arnold schwarzenegger wants to save marriage
Police constables rape attempt in bellampalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles