ఆరుగాలం శ్రమించి కష్టించిన రైతు బతుకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. చెల్లని పావలా మాదిరిగా తయారైంది. రైతు పండించిన కిలో టమోట ధర పావలా పలుకుతుంది. దీంతో మార్కెట్ లోకి తీసుకొచ్చిన టమోటాలను మార్కెట్ లోనే వదిలి వెళ్తున్నారు. మరి కొంత మంది రైతులు టమోటాలకు గిట్టు బాటు ధర లేక పోవడంతో వదిలి వేశారు. దీంతో పంటలు పశువులు, గొర్లకు పశుగ్రాసంగా మారింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా టమోట పంటలను సాగుచేస్తుంటారు. అయితే జూన్, జూలై మాసాల్లో టమోట ధర కిలో హోల్ సెల్ గానే 20 రూపాయలు పలుకగా
రైతులు ధర నిలకడగా ఉంటుందని, అలా ఉండకపోతే కనీసం కిలో కు 6నుండి 8రూపాయల ధర పలుకుతుందని ఆశ పడి టమోటను సాగుచేశారు. అయితే టమోట తెంపడాని రాగానే మార్కెట్ ధర కిలో పావలా కు పడిపోయింది. కర్నూల్ మార్కెట్ లో రైతులు వారు పండించిన టమోటలను వదిలివేయడంతో పశువులకు గ్రాసంగా మారింది. ఒక ఎకరం టమోట సాగు చేస్తే రైతుకు కనీసం 20నుండి 30వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో పావలాకు కిలో చొప్పున కొన్ని మార్కెట్లో ధర పలుకడంతో రైతులు దిక్కతోచని పరిస్థితుల్లో పడిపోవడంతో పాటు అప్పుల్లో కూరుకు పోయారు. ఎకరం టమోట సాగు చేసినటువంటి రైతుకు రోజుకు దాదాపు 10 క్వింటాళ్ల చొప్పున టమోటలు వస్తే క్వింటాల్ కు ధర 25 రూపాయలు పలికితే 10 క్వింటాళ్లకు మొత్తం 250 రూపాయలు వస్తాయి. అంటే రైతుకు టమోటలు తెంపిన ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో రైతులు వారి పంటలను పశువులకు వదిలి వేస్తున్నారు. ఇంతటి దారుణ మైన పరిస్థితి తలెత్తటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్న శ్రమకు విలువకట్టే షరాబు ఎవరు..
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more