Gas subsidi cylendors rise

gas-subsidi-cylendors-rise, upto nine, in congress ruling states

gas-subsidi-cylendors-rise

6.png

Posted: 09/21/2012 03:52 PM IST
Gas subsidi cylendors rise

        స్వపక్ష, విపక్షాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కేంద్రం వెనక్కితగ్గింది. తారాస్థాయిలో ఉన్న ప్రతిపక్షాల ఒత్తిళ్లు.. gasమమతా బెనర్జీ షాక్ తో యూపీఏకి దిమ్మ తిరిగింది. ఏడాదికి ఆరు సిలిండర్ల మించి పెంచేది లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరై మెట్టు దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఇవాళ ఆయా రాష్ట్రాల నాయకత్వానికి అందాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర నేతలతో సమావేశం తర్వాత అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్లు ఊమెన్ చాందీ.. వీరభద్రసింగ్.. కేవీ థామస్, హరీశ్ రావత్ వంటి సీనియర్లు చెప్పినా వినిపించుకోని అధిష్ఠానం నిన్నటి పరిణామాలతో మేల్కొంది. పరిస్థితి చేయిదాటడాన్ని గమనించి అప్పటికప్పుడు రాష్ట్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. సిలిండర్ల సంఖ్యను పెంచింది. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హర్యానా.. ఢిల్లీ ఇలా 14కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకే మరో మూడు సిలిండర్లు అదనంగా అందనున్నాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల క్రితమే సబ్సిడీ సిలిండర్లను ఆరునుంచి తొమ్మిదికి పెంచి సమాన్యులపై భరం తగ్గించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gurajada apparao birthday celebrations
Andhra pradesh assembly session  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles