బయటికెళ్లి సంపాదిస్తే తెలుస్తుంది.. అదెంత కష్టమో! ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? అయినా పొద్దున నేను ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్లి తిరిగొచ్చే దాకా ఖాళీగా కూర్చోవడం తప్ప చేసే పనేముంది? ...దాదాపు ప్రతి ఇంట్లోనూ వినిపించే మొగుడి మాట ఇది! ఇంటెడు చాకిరీ చేస్తున్నాను, అయినా నాకు గుర్తింపు లేదు! ఇంత పని చేస్తున్నందుకు నాకేమన్నా మీరు జీతమిస్తున్నారా? నేను చేసే పనికి లెక్క కడితే మీకన్నా ఎక్కువ సంపాదించినట్టే! ...ఇల్లాళ్ల తిరుగులేని జవాబు ఇది! ఆదివారమొస్తే మగవాళ్లకు పండగే! పొద్దున్నే పేపరు ముందేసుకుని కూర్చుంటారు. ఆరారగా కాఫీలూ టీలూ తాగుతూ.. టిఫిన్లు కానిచ్చి టీవీ ముందు సెటిలైపోతారు. పండగొచ్చినా పబ్బమొచ్చినా అంతే. కానీ, గృహిణులకు పాపం అలాంటి వెసులుబాట్లేవీ ఉండవు. పైగా, సెలవు రోజుల్లో వారు చెయ్యాల్సిన చాకిరీ పెరిగిపోతుంది! అదంతా జీతం బత్తెం లేని పనే! అయితే, ఇకపై మహిళలు తమ శ్రమకు గుర్తింపు లేదని బాధపడక్కర్లేదు! వారు చేసే చాకిరీకి మూల్యం పొందే రోజు మరెంతో దూరంలో లేదు.
భార్య చేసే సేవలకు భర్త నెలకింతని ఇవ్వాల్సిందేనంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఫలిస్తే గృహిణులకూ నెల జీతం దక్కడం ఖాయం. ఈమేరకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేస్తోంది. ఆ బిల్లును త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మహిళా సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ ఆలోచనకు రూపకల్పన చేస్తున్నామని ఆ శాఖ సహాయ మంత్రి కృష్ణ తీర్థ్ తెలిపారు.ముసాయిదా బిల్లు తయారవగానే ఆరునెలల్లోగా కేబినెట్ ముందు పెడతామని వివరించారు. ఒకవేళ అన్నీ కుదిరి ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ప్రతి భర్తా తన భార్య పేరిట బ్యాంకు ఖాతా తెరిచి, తమ జీతంలో 10 నుంచి 20 శాతం మొత్తాన్ని ఆ ఖాతాలో నెలనెలా జమ చేయాల్సి ఉంటుంది. రోజు కూలీల నుంచి అత్యున్నత స్థాయి అధికారుల దాకా అందరూ దీని పరిధిలోకి వస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more