Aditi mukherji first winner award

ADITI MUKHERJI, FIRST WINNER OF THE BORLAUG FIELD AWARD,World Food Prize Foundation,West Bengal,Rockefeller Foundation,Planning commission,Norman Borlaug Award,Norman Borlaug,Nobel Peace Prize,Jawaharlal Nehru University,International Water Management Institute,finance,Cambridge University,Aditi Mukherji

ADITI MUKHERJI, FIRST WINNER OF THE BORLAUG FIELD AWARD

ADITI.gif

Posted: 08/31/2012 04:21 PM IST
Aditi mukherji first winner award

ADITI MUKHERJI, FIRST WINNER OF THE BORLAUG FIELD AWARD

రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వ్యవసాయ విధానంలో మార్పులకు దోహదపడినందుకు పశ్చిమబెంగాల్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త అదితి ముఖర్జీకి ప్రతిష్ఠాత్మకమైన బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరచడానికి పనిచేసే క్షేత్ర స్థాయి శాస్త్రవేత్తలకు, కార్యకర్తలకు ప్రోత్సాహకంగా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ ఏడాది నుంచే ఈ అవార్డును ప్రవేశపెట్టింది. తొలి అవార్డే భారత్‌కు రావడం విశేషం.'అదితి తనదైన శైలిలో రైతుల సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె తన అధ్యయనాన్ని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకున్నారు. దీని వల్ల అనేక మంది రైతుల జీవితాలలో మార్పు వచ్చింద'ని ఫౌండేషన్ అధ్యక్షుడు కెన్నిస్ క్విన్ అన్నారు. స్విట్జర్లాండ్‌లోని లోవా నగరంలో అక్టోబర్ 17న ఈ అవార్డు ప్రదానం చేస్తారు. పురస్కారం కింద ఐదు లక్షల నగదు అందజేస్తారు.

ఢిల్లీలోని వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యయనకర్తగా అదితి వ్యవహరిస్తున్నారు.భూగర్భ జలాలను ఉపయోగించుకొని పశ్చిమబెంగాల్‌లో సెంటు, అరసెంటు పొలాల్లో కష్టంగా వ్యవసాయం చేస్తున్న నాలుగు వేల మంది రైతులపై అదితి జరిపిన అధ్యయనం మంచిపేరు తెచ్చింది. బెంగాల్ రైతులు తక్కువ శక్తి కలిగిన పంపులను ఉపయోగించుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉండేది. విద్యుత్ చార్జీలు కూడా భారీగా ఉండేవి. వీటిని సరిదిద్దితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అదితి తన అధ్యయనంలో తేల్చారు.దీనికోసం నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి వారి గోడును నమోదు చేశారు. ప్రణాళికా సంఘాన్ని కలిసి తన సూచనలు ముందుపెట్టారు. అదే సమయంలో జలవనరులు, వ్యవసాయం, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులను కలిసి సాగుపై సమీక్ష చేయడానికి ప్రణాళికా సంఘం సిద్ధమైంది. అదితి అందించిన ఆధారాలను, అధ్యయనాన్ని చూసి.. ఆమెను కూడా అధ్యయన బృందంలో చేర్చారు. ఈ బృందం సూచనల మేరకు బెంగాల్ ప్రభుత్వం రైతులకు మేలు కలిగేలా విధాన నిర్ణయాలు తీసుకుంది.నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవానికి ఆద్యుడు. 1970లో ఆయనకు నోబె ల్ బహుమతి లభించింది. 1986లో వరల్డ్డ్ ఫుడ్ ప్రైజ్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఈ బహుమతి అందిస్తారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇదే అత్యున్నత పురస్కారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  P chidambaram worships at tirumala temple
Mp spy reddy statement of resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles