Saina nehwal receives bmw car from sachin tendulkar

Saina Nehwal receives BMW car from Sachin Tendulkar,Saina Nehwal, Sachin Tendulkar,London Olympics,BMW Car

Saina Nehwal receives BMW car from Sachin Tendulkar

Saina.gif

Posted: 08/20/2012 01:48 PM IST
Saina nehwal receives bmw car from sachin tendulkar

Saina Nehwal receives BMW car from Sachin Tendulkar

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేతులమీదుగా బహుమతి అందుకోవడం ఎంతో ఆనందకరమని సైనా నెహ్వాల్ తెలిపింది. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో చాముండేశ్వరీనాథ్, అతని స్నేహితులు కలిసి సైనా నెహ్వాల్, గోపీచంద్, పీవీ సింధులకు కార్లను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సచిన్ ఈ ముగ్గురికీ కారు తాళం చెవులను అందించాడు. లెజెండరీ క్రికెటర్ తమకు బహుమతిని అందించడం పట్ల సైనా, సింధు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సినీ హీరో నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల సాకారమైంది..: తన తొమ్మిదో ఏటనుంచే ఒలింపిక్ పతకం సాధించినట్టుగా కలలు కనేదాన్నని సైనా చెప్పింది. ఇప్పుడా కల సాకారమయ్యే దిశగా కృషిచేసిన గోపీసార్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపింది. గత కొన్నేళ్లుగా గోపీ తన కోసం కఠోరంగా శ్రమించారని చెప్పింది. తన ఈ ఒలింపిక్ పతకంతో దేశంలో బ్యాడ్మింటన్ ముఖచిత్రం మారిపోయే అవకాశముందని, క్రికెట్ అంత కాకపోయినా ఎంతో కొంత ఆదరణ పెరగడం ఖాయమని సైనా చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now one can get six pack abs through surgery
American tv show host impressed with tata nano  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles