Thimmamma marrimanu of ananthapur

Thimmamma Marrimanu Of Ananthapur

Thimmamma Marrimanu Of Ananthapur

Ananthapur.gif

Posted: 08/18/2012 03:04 PM IST
Thimmamma marrimanu of ananthapur

Thimmamma Marrimanu Of Ananthapur

 కాలుష్య కాసారంగా మారుతున్న రాష్ట్రంలో వాతావరణ సమతుల్యతను  కాపాడేందుకు ప్రభుత్వం నడుంబిగించిది. 50 ఏళ్లు పైబడిన చెట్టు నరికివేతకు అడ్డుకట్ట వేయాలని  నిర్ణయించింది.  ఈ చెట్లను  జీవ వైవిద్యం చట్టం  పరిధిలోకి తేనుంది.  ఇప్పటికే కొన్ని చెట్లను  దీని పరిధిలోకి తెచ్చారు.  ఈ చట్టం  పరిధిలోకి  వచ్చే చెట్లను  ఎవరైనా  నరికితే.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల  జరిమానా విధించే  అవకాశం ఉంది.  అనంతపురం  జిల్లాలోని  తిమ్మమ్మమర్రిమానును  ఈ చట్టం  పరిధి లోకి తెచ్చారు.  అరెకరాల  విస్తీర్ణంలో ఉన్న ఈ చెట్టు గిన్నిస్ బుక్  రికార్డుకెక్కింది.  దీని వయస్సు 600 ఏళ్లని  అధికారులు  చెబుతున్నారు.  300  ఏళ్ల వయస్సున్న  మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి, హైదరాబాద్ లోని గోల్కొండ కోట దగ్గర ఉన్న హతియోంకా  జాడ్  చెట్లను కూడా  ఈ చట్ట పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  అటవీ శాఖ ద్వారా 50 ఏళ్ల వయస్సున్న  చెట్లను గుర్తించి  వాటి చరిత్రను  ఫొటోల రూపంలో  నిక్షిప్తం చేస్తారు.  గుర్తించిన చెట్ల వద్ద  వాటిని జీవ వైవిద్య చట్ట పరిధిలోకి  తెచ్చినట్లు బోర్డు  ఏర్పాటు చేస్తారు. చెట్ల  రక్షణకు గోడ లేదా కంచె  నిర్మిస్తారు. 50 ఏళ్ల పైబడిన చెట్టు రాష్ట్రంలో  భారీ సంఖ్యలో  ఉంటాయాని అధికారులు భావిస్తున్నారు.  ఈ చెట్లను  రక్షిస్తే  వాతావరణ  పరిరక్షణకు అవకాశం  ఉంటుందని  చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samsung galaxy note 101 tablet to take on apple ipad with stylus split screen
Father property to sons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles