Doc held for fake certificate

Doc held for fake certificate,

Doc held for fake certificate

Doc.gif

Posted: 08/16/2012 07:52 PM IST
Doc held for fake certificate

Doc held for fake certificate

తీగలాగితే డొంక కదిలింది... ఒక్క ఫిర్యాదుతో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది... అడిగిందే తడవుగా అనర్హులకు సైతం కుప్పలుతెప్పలుగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యమండలి లీలలు బట్టబయలయ్యాయి. ఒక్కో ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు ఏకంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు గుంజినట్లు వెల్లడైంది. ఎత్తు, ఛాతీ కొలతలతో పాటు కంటిచూపు సరిగా లేకపోయినా సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల(ఏఎంవీఐ) అభ్యర్థులనుంచి డబ్బులు తీసుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి అభ్యర్థుల రీ మెడికల్ చెకప్ నిర్వహించాలని లేఖరాశారు. దీంతో అభ్యర్థులందరినీ వరంగల్‌లోని మహాత్మాగాంధీ (ఎంజీఎం) ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రవాణా శాఖలో ఇటీవల 150 మంది ఏఎంవీఐల నియామకాలు జరిగాయి. వీరిలో చాలా మంది ఎత్తు తక్కువగా ఉన్నారు. మరికొందరికి కంటిచూపు సరిగా లేదు. ఈ బలహీనతలను వైద్య మండలిలో సభ్యులు సొమ్ము చేసుకున్నారు. బోర్డులో జనరల్ సర్జన్, జనరల్‌మెడిసిన్ డాక్టర్, ఆర్థోపెడిక్, కంటిచూపు నిపుణుడు (ఆఫ్తాల్మిక్), రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులు. అందరూ కుమ్మక్కై అనర్హులకు సైతం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అభ్యర్థుల ఫిట్‌నెస్ పరీక్షలపై ఆరోపణలు రావడంతో కొత్త మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్లు లక్ష్మీపార్థసారథి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రవాణా శాఖనుంచి తమకు అందిన ఫిర్యాదుమేరకు ఏఎంవీఐల వైద్య పరీక్షలకు కొత్త మెడికల్ బోర్డును నియమిస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్ చెప్పారు. ఉస్మానియా వైద్య మండలి ఇచ్చిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్-1 అభ్యర్థుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లపైనా ఇదే రీతిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎత్తు, దృష్టిలోపం ఉన్నవారికి ముడుపులు తీసుకుని ఫిట్‌నెస్ ధ్రువీకరణ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సింగం శెట్టి మధుకు ఫిట్‌నెస్‌లేనట్లు గుర్తించారు. దీంతో ఆయనను మళ్లీ మెడికల్ బోర్డుకు పంపించాలని లేఖ రాశారు. 2009లో కె.సునీల్‌దత్ అనే డీఎస్పీపై ఫిర్యాదులు రావడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి కొలతలు తక్కువగా ఉన్నాయని సర్వీసు నుంచి తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Effects of television on child health
Karuna to take to twitter facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles