Scholor ships apply date closeed

scholor ships apply date closeed

scholor ships apply date closeed

15.gif

Posted: 08/15/2012 04:56 PM IST
Scholor ships apply date closeed

     schoo_2  పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఫ్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే తుది గడువు ఆగస్టు 15 అని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే కావడంతో మంగళవారం వరకే పాఠశాలలు, కళాశాలల్లో దరఖాస్తులు తీసుకున్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల విద్యార్థులు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు ఫీజుల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిష్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తుతో పాటు ఆదాయ, నివాస, కుల ధృవీకరణ పత్రాలను విద్యార్థులు schol_1జతచేయవలసి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరగడం కారణంగా విద్యార్థులు సకాలంలో దరఖాస్తులను విద్యా సంస్థల్లో దాఖలు చేయలేకపోయారు. ఈ ఏడాది నుంచి వివిధ ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో వేలాది మంది నగరంలో స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశాన్ని కోల్పోయారు. గత ఏడాదితో పోల్చితే స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ధృవీకరణ పత్రాల జారీలో జరిగిన జాప్యం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని నేతలు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునే గడువును మరో నెల రోజులు పొడించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suprising incident in america
Panic incidents in andhrapradesh today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles