Tamilnadu express burning incident report

tamilnadu express burning incident report

tamilnadu express burning incident report

3.gif

Posted: 08/06/2012 01:59 PM IST
Tamilnadu express burning incident report

       తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనకు దారితీసిన మిస్టరీ చీకట్లు వీడనున్నాయి. ఈ ఘోరం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరగలే దని, బాణాసంచా tamil_exp_1రసాయనాల మంటలే కారణ మని ఫోరెన్సిక్‌ నిపుణులు ఒక అంచనాకు వచ్చారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం బాణాసంచా తయా రీలో ఉపయోగించే మండే స్వభావం ఉన్న భాస్వ రం, పొటాషియం వంటి రసాయనాలే మంటలకు కారణమని ఆదివారం తేల్చిచెప్పారు. ఈ రైళ్లో రసాయనాల రవాణ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసు కుందనే నిర్ధారణకు వచ్చారు.
        ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతిచెందగా, పలువురు క్షత గాత్రులై చెన్నై, నెల్లూరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొన్ని మృతదేహాలు ఎవరివ నేది తేలలేదు. గల్లంతయిన వారి వివరాలు దొరక లేదు. మొత్తం 72 మంది రిజర్వేషన్‌ బోగిలో ఉండగా, జాబితాలో లేని మరో ముగ్గురు ఇందులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన అనంతరం తీవ్రవాద సంస్థలు గానీ, సంఘ విద్రోహశక్తులు కానీ ఇందుకు తామే బాధ్యుల మంటూ ఎటువంటి ప్రకటనలు చేకపోవటంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు గత మూడు రోజులుగా బోగి టిసి, రైల్వేగేట్‌మెన్‌, అందులో ప్రయాణించిన వారిని, పలువురు స్థానికులను మొత్తం 70 మందిని విచారించారు. tamil_muni_2
       అంతకుముందు రైల్వే భద్రత దళ కమిషనర్‌ డి.కె.సింగ్‌ ఆధ్వర్యంలో బహిరంగ విచారణలో ప్రత్యేకాధికారి ప్రదీప్‌సింగ్‌ తదితరులు రసాయనాల కారణంగానే మంటలు చెలరేగినట్లు నిర్థారణకు వచ్చారు. బోగిలోని 52, 53, 54, 55, 56 సీట్ల నుంచే ఈ విస్ఫోటనం జరిగినట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు ఆదివారం తెలిపారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన చిత్ర, సుధీర్‌లు కూడా రైలు ప్రమాదం జరిగినప్పుడు శబ్ధాలు వినిపించాయని తెలిపారు. ఆ శబ్దాలు బాణాసంచా తయారీలో వాడే సల్ఫర్‌, పొటాషియం, ఫాస్పరస్‌ మిశ్రమాలు అయి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉన్నతాధికారులకు తమ నివేదికను సమర్పించారు. మొత్తమ్మీద ఈ దుర్ఘటనకు బాణా సంచా రసాయనాలే కారణమని పేర్కొన్న అధి కారులు, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేస్తు న్నారు. అయితే అంత విస్ఫోటనానికి కారణమైన సామాగ్రి రైల్లో ఉంటే రైల్వే నిఘా విభాగం, పోలీసులు, టిసి తదితర అధికారుల నిర్లక్ష్యంపై మాట్లాడలేదు. అంతేకా కుండా ఇటు దొంగ రవాణ అవుతుండగా, ప్రయాణీకులు సిగరెట్‌ కాల్చడం వలన జరిగిందా? లేక ఆగంతకులు విద్రోహశక్తులు ఇలా పథకం వేశారా అనేది నిర్థారణ కావలసి ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seperate rayalasima agitation byreddy rajashekar reddy
Telanga leaders fight in swami goud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles